గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 9 మార్చి 2024 (22:16 IST)

10-03-2024 నుంచి 16-03-2024 వరకు మీ వార రాశి ఫలితాలు

weekly astro
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆత్మస్థైర్యంతో శ్రమిస్తే విజయం తథ్యం. మీ సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోండి. దుబారా ఖర్చులు తగ్గించుకోవటం శ్రేయస్కరం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. మానసికంగా కుదుటపడతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి సారిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. నూతన వ్యాపారాలు అనుకూలించవు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లావాదేవీలతో తీరిక ఉండదు. అకాలభోజనం, శ్రమ అధికం. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు. ఆదివారం ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. విద్యారులు ఆందోళన తగ్గి కుదుటపడతారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. సోమ, మంగళవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాతవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. మీ సిఫార్సుతో ఒకరికి మంచి జరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. దస్త్రం కార్యక్రమానికి సన్నాహాలు సాగిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. అపోహలు, అనుమానాలకు తావివ్వవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. బుధవారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఆప్తుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. గృహాలంకరణ పట్ల ఆసక్తి కలుగుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఏజెంట్లు, రిప్రజెంటేటివ్లు లక్ష్యాలను పూర్తి చేయగల్గుతారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలు అధికం. ఓర్పుతో మెలగండి. అవకాశాలు చేజారిపోతాయి. సమర్ధతకు గుర్తింపు ఉండదు. పట్టుదలతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. అయిన వారే మీ చిత్తశుద్ధిని సందేహిస్తారు. ఆప్తులతో సంభాషణ ఊరటనిస్తుంది. ఆదాయం నిరాశాజనకం. నిస్తేజానికి లోనవుతారు. అతిగా ఆలోచింపవద్దు. వ్యాపకాలు సృష్టించుకోండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. మంగళ, బుధవారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. యోగ, ఆధ్యాత్మికతలపై ఆసక్తి పెంపొందుతుంది. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. రుణసమస్యలు తొలగుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. గురువారం నాడు అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. కీలక పత్రాలు అందుకుంటారు. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగస్తులకు పనిభారం. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వాహనదారులకు అత్యుత్సాహం తగదు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ధనలాభం, వాహనసౌఖ్యం పొందుతారు. ఖర్చులు విపరీతం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పెట్టుబడులకు తరుణం కాదు. పనులు చురుకుగా సాగుతాయి. ఆది, సోమవారాల్లో అపరిచితులతో జాగ్రత్త. మీ నుంచి విషయసేకరణకు కొందరు యత్నిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. నిరుద్యోగులకు శుభయోగం. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అకౌంట్స్ రంగాల వారికి పనిభారం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అన్ని రంగాల వారికీ యోగదాయకమే. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సమస్యలను ధీటుగా ఎదుర్కుంటారు. మీ చిత్తశుద్ధికి ప్రశంసలు లభిస్తాయి. ఆదాయం బాగుంటుంది. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. కొంతమొత్తం సాయం అందించండి. వివాహయత్నం ఫలిస్తుంది. వేదికలు అన్వేషిస్తారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. మంగళ, బుధవారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. విలువైన వస్తువులు సమయానికి కనిపించవు. మీపై శకునాల ప్రభావం అధికం. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో మెలగండి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. అధికారులు, ఉద్యోగస్తులకు పనిభారం. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సంప్రదింపులు ఫలిస్తాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది, సమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి అమర్చుకునే దిశగా యత్నాలు సాగిస్తారు. సోమవారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. చిన్న విషయాలకే చికాకుపడతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఇంటి విషయాలపై దృష్టి పెట్టండి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. ఏజెంట్లు, రిప్రజెంటేటివ్‌లు టార్గెట్లను అధిగమిస్తారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. హోల్ సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లావాదేవీలు పురోగతిన సాగుతాయి. కొంత మొత్తం ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. ఆది, సోమవారాల్లో ఫోన్ సందేశాలను నమ్మవద్దు. సన్నిహితులతో కీలక విషయాలు చర్చిస్తారు. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఉపాధ్యాయులకు ఓర్పు ప్రధానం. అధికారులు ఆగ్రహావేశాలకు గురవుతారు. అకౌంట్స్ రంగాల వారికి పనిభారం. నూతన వ్యాపారాలకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ప్రేమ వ్యవహారాలు సమస్యాత్మకమవుతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు ఓర్పు, కృషి ప్రధానం. యత్నాలు విరమించుకోవద్దు. ఆశావహదృక్పథంతో మెలగండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. ఖర్చులు సామాన్యం. గురువారం నాడు చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు పరిశీలించుకుంటారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. విద్యార్థుల్లో ఆందోళన తగ్గి కుదుటపడతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఈ వారం అనుకూలదాయకం. పరిస్థితులు చక్కబడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. సమర్ధతను నిదానంగా గుర్తింపు లభిస్తుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. పనులు వేగవంతమవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. బుధవారం నాడు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. గృహమార్పు కలిసివస్తుంది. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపార లావాదేవీలతో తీరిక ఉండదు. చిరువ్యాపారులకు ఆశాజనకం. వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాయగల్గుతారు.