గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 2 మార్చి 2024 (20:13 IST)

03-03- 2024 నుంచి 09-03-2024 వరకు మీ వార రాశి ఫలితాలు

weekly astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రతికూలతలు అధికం. ఆచితూచి అడుగేయాలి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. బుధవారం నాడు పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. దంపతుల మధ్య చీటికిమాటికి కలహాలు. ఆత్మీయులతో సంభాషణ ఊరటనిస్తుంది. ధైర్యంగా ముందుకు సాగుతారు. అపరిచితులతో జాగ్రత్త. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. కీలక పత్రాలు అందుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థల మార్పు అనివార్యం. ఉపాధ్యాయ, ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు. అకౌంట్స్ రంగాల వారికి పనిభారం. విద్యార్థులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యసాధనకు సంకల్పబలం ప్రధానం. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ ప్రభావం చూపుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శుక్ర, శనివారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. కార్మికులు, వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. నిర్మాణాలు, మరమ్మతులు పూర్తికావస్తాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. లక్ష్యాలను సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. రుణసమస్యలు పరిష్కారమవుతాయి. ఆందోళన తొలగి స్థిమితపడతారు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఖర్చులు అధికం. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు హోదామార్పు. ఆరోగ్యం సంతృప్తికరం. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలం. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. సోమ, మంగళవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. రిప్రజెంటేటివ్‌లు టార్గెట్లను అధిగమిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆచితూచి అడుగేయాలి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. అందరితోను మితంగా సంభాషించండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. పనులు అర్థాంతంగా నిలిపివేయవలసి వస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకోండి. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. గురువారం నాడు పరిచయం లేని వారితో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. ఆప్తులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి సారిస్తారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహపరుస్తాయి. అధికారులకు అదనపు బాధ్యతలు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1, 2 పాదాలు
కీలక చర్చల్లో పాల్గొంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఉభయులకూ మీ నిర్ణయం ఆమోదయోగ్యమవుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. దూరపు బంధువులతో సంబంధాలు బలపడతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. బుధ, గురువారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. అకౌంట్స్ రంగాల వారికి పనిభారం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ఆరోగ్యం బాగుంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సాయం ఆశించవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. శనివారం నాడు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమ్రాలు వాయిదా వేసుకుంటారు. ఒక ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. మధ్యవర్తులతో జాగ్రత్త. ఉద్యోగస్తులు తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఉన్నతాధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లకు ఆదాయాభివృద్ధి, కార్మికులకు పనులు లభిస్తాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంతోషకరమైన వార్తలు వింటారు. ఆర్థికలావాదేవీలు సంతృప్తినిస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఖర్చులు భారమనిపించవు. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆదివారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. ఫోన్ సందేశాలకు స్పందించవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించండి. మీ శ్రీమతి అభిప్రాయాలను తేలికగా తీసుకోవద్దు. గృహమార్పు అనివార్యం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. అధికారులకు అదనపు బాధ్యతలు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు పనిభారం. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వాహనదారులకు దూకుడు తగదు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. లక్ష్మాన్ని సాధిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. వ్యాపకాలు అధికమవుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. పిల్లల చదువులపై శ్రద్ధ వహిస్తారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మంగళవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ఉపాధి పథకాలు చేపడతారు. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. కీలక చర్చల్లో పాల్గొంటారు. వివాదాలు పరిష్కారమవుతాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. వ్యవహారదక్షతతో రాణిస్తారు. మీ చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వాహనయోగం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. వివాహయత్నం ఫలిస్తుంది. కల్యాణ వేదికలు అన్వేషిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఆశావహదృక్పథంతో ఉద్యోగయత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు శుభయోగం. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ వారం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఎవరినీ అతిగా నమ్మవద్దు. తెలిసిన వ్యక్తులే మోసగించేందుకు యత్నిస్తారు. ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించండి. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పెట్టుబడుల విషయంలో మెలకువ వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. సంతానం భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. గృహ నిర్మాణాలు పూర్తవుతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. సభలు, కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆప్తుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. నోటీసులు ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. సంతానానికి కృషి ఫలిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. సోదరీ సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు పదవీయోగం. ఉపాధ్యాయులకు పనిభారం. శుభకార్యానికి హాజరవుతారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి.