మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : గురువారం, 30 ఏప్రియల్ 2020 (21:01 IST)

01-05-2020 నుంచి 31-05-2020 వరకు మీ మాస ఫలాలు

మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. 
ఈ మాసం ఆశాజనకం. కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. పరిచయాలు బలపడతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం పై చదువులపై దృష్టిపెడతారు. సోదరులతో సంత్సంబంధాలు నెలకొంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనం ఇతరులకివ్వవద్దు. ఆత్మీయుల క్షేమ సమాచారం తెలుసుకుంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. గుట్టుగా వ్యవహరించండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా వ్యవహరించాలి. ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆచితూచి వ్యవహరించాలి. పరిచయంలేని వారితో జాగ్రత్త. దంపతుల మధ్య దాపరికం తగదు. వాయిదాపడిన పనులు పూర్తిచేస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కార్యక్రమాల్లో మార్పులుంటాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వుసు 1, 2, 3 పాదాలు. 
వ్యవహారానుకూలత అంతంత మాత్రమే. ఓర్పుతో వ్యవహరించాలి. ఖర్చులు అదుపులో ఉండవు. ధన సమస్యలెదురవుతాయి. మీ శ్రీమతి సాయం అందుతుంది. ఆప్తులను కలుసుకుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలివేయండి. ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. సమర్థతను చాటుకుంటారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. పెట్టుబడులకు తరుణం కాదు. అధికారులకు పనిభారం, విశ్రాంతి లోపం. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. 
ఈ మాసం యోగదాయకం. ఆదాయం బాగుంటుంది. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. గృహమార్పునకు యత్నాలు సాగిస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. నగదు స్వీకరణ, చెల్లింపుల్లో మెలకువ వహించండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పరిచయాలు అధికమవుతాయి. వ్యవహారాలతో తీరిక ఉండదు. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. వ్యాపారాభివృద్ధికి రూపొందిస్తారు. చిరువ్యాపారులకు సామాన్యం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదా మార్పు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
సమర్థతను చాటుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ధనయోగం ఉంది. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ప్రియతముల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. నగదు, పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం దూకుడు అదుపు చేయండి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంప్రదింపులకు అనుకూలం. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. పెద్దమొత్తం సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. ఆప్తుల క్షేమం తెలుసుకుంటారు.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హిస్త, చిత్త 1, 2 పాదాలు. 
పట్టుదలతో శ్రమించండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే రాణిస్తారు. ఖర్చులు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. వ్యవహారానుకూలత అంతంతమాత్రమే. వ్యతిరేకులతో జాగ్రత్త. విమర్శలు, అభియోగాలు ఎదుర్కొంటారు. ద్వితీయార్థం కొంతమేరకు అనుకూలం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వాయిదాపడిన పనులు ఎట్టకేలకు పూర్తికాగలవు. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. పరిచయాలు బలపడతాయి. బంధువులు చేరువవుతారు. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రదానం. అధికారులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధికమిస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. 
ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అవకాశాలు చేజారిపోతాయి. ఆశావహ దృక్పథంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం దూకుడు అదుపు చేయండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. వృత్తుల వారికి నిరాశాజనకం. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. ప్రయాణానికి సన్నాహాలు సాగిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట. 
మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సంతానం సౌఖ్యం, ధనలాభం పొందుతారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. మీ సలహా ఎదుటివారికి కలిసివస్తుంది. లౌక్యంగా వ్యవహరిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం. సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. అపరిచితులను దూరంగా ఉంచండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానం పైచదువులను వారి ఇష్టానికే వదిలివేయండి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. చిరు వ్యాపారులకు కష్టకాలం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. 
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. 
ఈ మాసం శుభదాయకమే. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. ఎవరినీ కించపరచవద్దు. సమస్యలు క్రమంగా సద్దుమణుగుతాయి. ఒక విషయం ఉపశమనం కలిగిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. పరిచయాలు అధికమవుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. ప్రియతముల క్షేమం తెలుసుకుంటారు. వాహనం విలువైన వస్తువులు మరమ్మతులకు గురవుతాయి. 
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
లక్ష్యాలను నిర్ధేశించుకుంటారు. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంది. పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. సంప్రిందుపులకు అనుకూలం. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వాయిదాపడిన పనులు ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆదాయం సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. రుణ సమస్యలు కొలిక్కివస్తాయి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. గృహంలో స్తబ్దత తొలగుతుంది. ఆరోగ్యం పట్ల అలక్ష్యం తగదు. బంధువులతో స్వల్ప విభేదాలు తలెత్తుతాయి. ఏ విషయాన్ని తెగే వరకు లాగవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు కొత్త బాధ్యతలు విశ్రాంతి లోపం. వ్యాపారాల్లో ఒడిదుడుకలను అధికమిస్తారు. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు. శతభిషం, పూర్వాభద్ర 1, 2, 3 పాదాలు. 
ఈ మాసం ఏమంత అనుకూలం కాదు. అప్రమత్తంగా వ్యవహరించాలి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. సన్నిహితుల సాయం అందిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. మీ శ్రీమతితో విభేదిస్తారు. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. సంతానం దూకుడు అదుపుచేయండి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. నగదు, పత్రాలు జాగ్రత్త. గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ప్రయాణం వాయిదాపడుతుంది. 
 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. 
ఆదాయ వ్యయాలకు ఏమాత్రం పొంతనవుండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. వ్యవహారాలు మ చేతుల మీదుగా సాగుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. గుట్టుగా వ్యవహరించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. నమ్మకస్తులే మోసగించే ఆస్కారం ఉంది. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. గృహమార్పు అనివార్యం. సంతానం చదువులపై దృష్టిపెడతారు. విద్యా ప్రకటనలను విశ్వసించవద్దు. వ్యాపారాలు పుంజుకుంటాయి. గృహమార్పు అనివార్యం. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే అనుకూలం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. అధికారులను ఉద్యోగస్తులు ప్రసన్నం చేసుకుంటారు. ప్రియతముల క్షేమం ఉపశమనం కలగిస్తుంది. దైవకార్యంలో పాల్గొంటారు.