బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2022 (23:04 IST)

శ్రీ రామచంద్రుడు ఆచరించిన నవరాత్రి వ్రతం.. అష్టమి రోజున?

lord rama
నవరాత్రులలో మొదటి మూడు రోజులు లక్ష్మీదేవికి, తరువాతి మూడు రోజులు శక్తికి, చివరి మూడు రోజులు సరస్వతికి అంకితం చేస్తారు. అలాంటి నవరాత్రి పూజను శ్రీరాముడు కూడా చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. దేవీ భాగవతంలో, రాముడు ఆచరించిన నవరాత్రి వ్రతం గురించి వ్యాస మహర్షి వివరించారు. 
 
"రామచంద్రా! రావణుని సంహరించే మార్గం చెబుతాను. నవరాత్రులలో ఉపవాసం ఉండి, అమ్మవారిని పూజిస్తే.. మీకు అపరిమితమైన వరాలను ప్రసాదిస్తుంది.. ఇంద్రుడు, విశ్వామిత్రుడు వంటి వారు నవరాత్రి వ్రతాన్ని ఆచరించి ప్రయోజనం పొందారు.  కాబట్టి నవరాత్రి వ్రతమాచరించండి’’ అని చెప్పి ఉపవాస పద్ధతుల గురించి చెప్పారు.
 
ఆపై నారదుని సూచన మేరకు నవరాత్రి పూజను రాముడు చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. అష్టమి ఎనిమిదో రోజు అర్ధరాత్రి అమ్మవారి సింహవాహినిగా శ్రీరాముడికి దర్శనం ఇచ్చింది. 
 
ఆపై ఆయన రావణుడిని సంహరించినట్లు కథనం. కాబట్టి నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని పూజించడం ద్వారా సకల ఐశ్వర్యాలు చేకూరుతాయని.. కార్యసిద్ధం కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.