ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (11:04 IST)

దేవీ నవరాత్రులలో రెండవ రోజు.. లలితా సహస్ర నామాన్ని..?

Bala Tripura Sundari
Bala Tripura Sundari
దేవీ నవరాత్రులలో రెండవ రోజు శ్రీ బాలత్రిపుర సుందరీ దేవి అవతారంలో అమ్మవారిని పూజించాలి. ఈ రోజు మంగళవారం రావడంతో సాయంత్రం దీపం వెలిగించి లలితా సహస్ర నామాన్ని పఠించాలి. 
 
ఈ రోజు అమ్మవారు త్రిపురా సుందరి అంశ నుండి పుట్టినటువంటి 9 ఏళ్ళ బాలికగా కనిపిస్తారు. శ్రీ బాలత్రిపుర సుందరీ దేవి అమ్మవారు చిన్న వయసులోనే తల్లి సహాకారముతో అనేకమంది రాక్షసుల సంహారము చేసినట్టు చెప్తారు. 
 
ఆశ్వయుజ మాస శుక్ల పక్ష విదియ రోజున అమ్మవారిని శ్రీ బాలత్రిపుర సుందరీ దేవిగా పూజిస్తారు. ఈ రోజు బాలత్రిపుర సుందరి దేవిని ఆకుపచ్చ రంగు వస్త్రంతో అలంకరించాలి. ఈ రోజు అమ్మవారికి తియ్యటి బూందీ, శెనగలు, పాయసం నైవేద్యంగా సమర్పించాలి.