ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2022 (13:21 IST)

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న విక్రమ్ కోబ్రా

Cobra
చియాన్ విక్రమ్, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి జంటగా నటించిన చిత్రం కోబ్రా ఆగస్టు 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇందులో విక్రమ్ వివిధ గెటప్స్‌లో నూటికి నూరు శాతం మార్కులు కొట్టేశాడు. లెక్కల మాస్టారుగా ఉన్న మది క్రైమ్స్ ఎందుకు చేశాడనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. 
 
ఈ చిత్రంలో ఇంటర్ పోల్ అధికారి పాత్రలో మాజీ క్రికెటర్ ఇర్పాన్ పఠాన్ నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. 
 
తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ఇది వరకే సోనీ లివ్ భారీ మెుత్తానికి సొంతే చుసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సెప్టెంబరు 28న ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీ లివ్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఈ మేరకు కొత్త ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేసింది. 
 
అయితే ఇక్కడే చిన్న గందరగోళం నెలకొంది. సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించినప్పటికీ ఏయే భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందనే విషయాన్ని మాత్రం చిత్ర యూనిట్ తెలుపలేదు.