బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

మాఘమాసంలో చెరుకు రసం, ఉసిరి దానాలు చేస్తే..?

మాఘమాసంలో చేసే దానాలకు అధిక ప్రాధాన్యత వుంది. మాఘ శుక్ల సప్తమి నాడు గుమ్మడి కాయను, శుక్లపక్ష చతుర్థశి నాడు వస్త్రాలు, దుప్పట్లు, పాద రక్షలను దానం చేస్తే ఇహంలో సుఖ సంతోషాలు, మరణానంతరం బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ఈ మాసంలో చెరుకు రసం, ఉసిరి దానాలు కూడా కూడా ఎంతో ఫలదాయకం. 
 
మాఘ మాసంలో బంగారు తులసీ దళాన్ని దానం చేయడం వలన సమస్త పాపాలు నశించి సకలాభీష్టాలు నెరవేరుతాయి. సాలగ్రామ దానం చేసిన వారికి తీసుకున్న వారికి కూడా శుభం కలుగుతుంది. ఈ మాసంలో చేసే అన్నదానం వల్ల సకల పుణ్యాలు లభిస్తాయి. మాఘమాసంలో ప్రతి దినం అన్నదానం చేయలేని వారు, మాఘ మాసం చివరి రోజున యథాశక్తి అన్నదానం చేసినా ఫలితం వుంటుంది. 
 
రాగి పాత్రలో కాని కంచు పాత్రలో కాని నువ్వులు పోసి బంగారంతో సహా దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. నువ్వులు సువర్ణం కలిపి దానం చేస్తే ఎలాంటి పాపాలైనా నశిస్తాయి. ముఖ్యంగా త్రివిధ పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.