ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (15:41 IST)

ఎఫ్-2 ముద్దుగుమ్మకు పెళ్లి.. బాయ్‌ఫ్రెండ్‌కు బర్త్ డే విషెస్ (video)

ఎఫ్-2 ముద్దుగుమ్మ త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. 'కృష్ణగాడి వీరప్రేమగాథ' చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన పంజాబీ ముద్దుగుమ్మ అయిన మెహరీన్ కౌర్ మహానుభావుడు, రాజా ది గ్రేట్‌, నోటా, ఎఫ్‌-2 చిత్రాల ద్వారా యువతరంలో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. 
 
తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 17 చిత్రాల్లో నాయికగా నటించింది. ప్రస్తుతం మెహరీన్‌ తెలుగులో 'ఎఫ్‌-2' సీక్వెల్‌ 'ఎఫ్‌-3'లో కథానాయికగా నటిస్తోంది. తాజాగా హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ భిష్ణోయ్‌ మనుమడు భవ్య బిష్ణోయ్‌తో మెహ్రీన్ ఏడడుగులు వేయనున్న సంగతి తెలిసిందే. 
 
మార్చి 13న వీరి నిశ్చితార్థం రాజస్థాన్‌లోని జోద్‌పూర్ విల్ల ప్యాలెస్‌లో జరగనుండగా, ఇది పూరైన కొద్ది రోజులకు వివాహ వేడుక జరిపించనున్నారు. ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమిదని, జీవితంలో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని మెహరీన్‌ చెప్పింది.
 
ఇక ఈ రోజు తనకు కాబోయే భర్త భవ్యకు బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేస్తూ.. అతనితో దిగిన ఫొటో షేర్ చేసింది. ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది.