భీష్మ ఏకాదశి.. ఆరుద్ర నక్షత్రం, ఏకాదశి: శ్రీకృష్ణ పూజ చేస్తే..?

Bheeshma Ekadasi
Bheeshma Ekadasi
సెల్వి|
ఫిబ్రవరి 23, మంగళవారం, మాఘమాసం, శుక్లపక్షం, ఏకాదశి తిథి, ఆరుద్ర నక్షత్రం కలిసివచ్చే శుభదినం. ఈ రోజును జయ ఏకాదశి, భీష్మ ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజున భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో శ్రీకృష్ణుడి పరమాత్మలో లీనమై తరించాడు. భీష్ముడు కురుక్షేత్రంలో తనువు చాలించే సమయంలో, ధర్మరాజుకి విష్ణు సహస్ర నామాన్ని బోధించిన పరమ పవిత్రమైన తిథి ఈ ఏకాదశి.

ఈ రోజున భీష్ముల వారిని స్తుతించడం.. శ్రీ మహావిష్ణువును పూజించడం చేస్తే స్వర్గ ప్రాప్తి ఖాయమని.. ఏకాదశి వ్రతం ఆచరించడం సమస్త దోషాలను తొలగిస్తుందని పండితులు చెప్తున్నారు. అలాగే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా అది కచ్చితందా విజయవంతం అవుతుంది.

ఇంద్రుడు ఇదే రోజున రాక్షసులపైకి యుద్ధానికి వెళ్ళి.. పరమాత్ముని కృపతో విజయం సాధించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఇలా మహానుభావులే భీష్మ ఏకాదశి రోజున చేపట్టిన కార్యాల్లో దిగ్విజయం సాధించిన దాఖలాలు వున్నాయి. ఈ రోజున ఆరుద్ర నక్షత్రం రావడంతో శివకేశవుల పూజకు కూడా ఉత్తమం. అందుకే విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, ఏకాదశి వ్రతం ఆచరించడం.. మహాశివునికి అభిషేకాలు చేయించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.దీనిపై మరింత చదవండి :