ఫిబ్రవరి 16న వసంత పంచమి: సరస్వతి దేవికి నేతితో పిండివంటలు..?

saraswati
saraswati
సెల్వి|
మాఘశుద్ధ పంచమినే ‘వసంత పంచమి' అంటారు. చదువుల తల్లి సరస్వతి దేవి అమ్మవారి పుట్టినరోజునే వసంత పంచమిగా జరుపుకుంటాం. మాఘ శుద్ధ పంచమి నాడు జరిగే ఈ పర్వదినాన్ని శ్రీ పంచమి అని కూడా అంటారు.

ఈ పండుగ ఉత్తర భారతదేశంలో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున సరస్వతీ దేవితో పాటు సంపదలను ఇచ్చే లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ పద్మ పురాణంలోనూ సరస్వతి గురించి వివిధ గాధలున్నాయి.

మాఘ నెలలో శుక్లా పంచమిలో ఈ వసంత పంచమిని జరుపుకుంటారు. ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 16న ఈ వసంతి పంచమి వచ్చింది. ఆరోజున సరస్వతి దేవి ఆరాధించడం ద్వారా బలం మరియు జ్ఞానం వస్తుంది.

ఈ రోజున ఎన్నో శుభకార్యాలను నిర్వహిస్తారు. సకలవిద్యా స్వరూపిణి సరస్వతీ దేవిగా జన్మదినంగా పేర్కొన్నారు. శ్రీ పంచమిని విద్యారంభ దినమని, వాగ్దేవిని ఆరాధించి, అక్షరాభ్యాసం చేయాలని బ్రహ్మవైవర్త పురాణం తెలియజేస్తుంది.

వసంత పంచమి శుభ సమయం..
పవిత్ర సమయం ఫిబ్రవరి 16న మధ్యాహ్నం 3.36కు ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 17న ఉదయం 5.46 గంటల వరకు ఉంటుంది. ఫిబ్రవరి 16న ఉదయం 6.59కి సరస్వతి దేవికి పూజ చేయడం, మధ్యాహ్నం 12.35కి మధ్య శుభ సమయం ఉంటుంది.

సరస్వతి దేవికి పూజా విధానం..
వసంత పంచమి రోజున సరస్వతి దేవిని తెల్లని పుష్పాలతో పూజించి అమ్మవారిని శ్వేత లేదా పసుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి. తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నం.. నేతితో పిండివంటలు, చెరకు, అరటిపండ్లు, నారికేళం వంటకాలు చేసి అమ్మవారికి నివేదించాలి. ఇలా పూజిస్తే దేవి అనుగ్రహం లభిస్తుంది.దీనిపై మరింత చదవండి :