గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2021 (11:13 IST)

ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబరు 9న లైగర్ రిలీజ్

టాలీవుడ్ యువ సంచలనం విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త చిత్రం లైగర్. సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీని గురువారం ప్రకటించారు. 
 
భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీని సెప్టెంబరు 9వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం తాజాగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. 
 
 
మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ భామ అనన్యా పాండే కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ రోజు (గురువారం) నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ముంబైలో ప్రారంభం కాబోతోంది.