శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (16:31 IST)

ఉద్యోగం రాలేదనీ భార్యను హతమార్చిన కసాయి భర్త.. ఎక్కడ?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ కసాయి భర్త కట్టుకున్న భార్యను హత్య చేశాడు. ఉద్యోగం దొరకలేదన్న అక్కసుతో ఆయన ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దారుణం గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లఖింపూర్‌ ఖేరి జిల్లాకు వజీద్‌పూర్‌ గ్రామానికి చెందిన సంజయ్‌ తన భార్య నిషాతో కలిసి గత కొద్దిరోజులుగా తమ కుమారుడు పనిచేస్తున్న గ్రామానికి వచ్చి నివసిస్తున్నారు.
 
నెలల తరబడి కొలువు రాకపోవడంతో భార్యా భర్తల మధ్య వివాదం నెలకొంది. భార్యను ఊపిరాడకుండా చేసి చంపిన అనంతరం వ్యక్తి సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని తనువు చాలించాడు.
 
దీనిపై వారి కుమారుడు పవన్ స్పందిస్తూ, తమ తల్లితండ్రులు వ్యక్తిగత గొడవలతో నిత్యం ఘర్షణ పడేవారని చెప్పాడు. దీనికితోడు ఆర్థిక పరిస్థితులు చుట్టుముట్టాయి. 
 
దీంతో సంజయ్‌ తీవ్ర నిర్ణయం తీసుకునివుంటాడని పోలీసులు పేర్కొన్నారు. వివాహేతర సంబంధం కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నామని డీసీపీ రణ్‌విజయ్‌ సింగ్‌ చెప్పారు.