శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Modified: శనివారం, 12 జనవరి 2019 (22:41 IST)

13-01-2019 నుంచి 19-01-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)

కర్కాటకంలో రాహువు, వృశ్చికంలో గురు, శుక్రులు, ధనస్సులో రవి, బుధ, శని, మకరంలో కేతువు, మీనంలో కుజుడు. మీన, మేష, వృషభ, మిధునంలో చంద్రుడు. 14న రవి మకర ప్రవేశం. 14న భోగి, 15న మకర సంక్రాంతి, 16న కనుమ, 17న ముక్కునుమ, సావిత్రీ గౌరీ వ్రతం. 19న శని త్రయోదశి. వృషభ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర రాశుల వారు శనికి తైలాభిషేకం చేయించిన శుభం, జయం.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఖర్చులకు అంతుండదు. ధనవ్యయం విపరీతం. పొదుపు ధనం అందుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలను మధ్యవర్తుల ద్వారా తెలియజేయండి. ఆది, సోమ వారాల్లో ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఆత్మీయుల సలహా పాటించండి. సోదరులతో అవగాహన నెలకొంటుంది. ప్రేమానుబంధాలు బలపడుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. వేడుకను ఘనంగా చేస్తారు. ఆందోళన తొలగి కుదుటపడుతారు. ఊహించని సంఘటనలెదురవుతాయి. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తులకు అడ్వాన్స్‌లు మంజూరవుతాయి. ఉద్యోగ యత్నంలో నిరుత్సాహం తగదు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడుతారు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సంతానం కోసం బాగా వ్యయం చేస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. కొంతమంది రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. మంగళ, బుధ వారాల్లో ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. పోగొట్టుకున్న పత్రాలు లభిస్తాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. అధికారులకు స్థానచలనం, బాధ్యతల మార్పు. వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. ప్రయాణం చికాకుపరుస్తుంది. జూదాల జోలికి పోవద్దు.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఖర్చులు అంచనాలను మించుతాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. వేడుకలకు హాజరవుతారు. మీ రాక బంధువులకు సంతోషాన్నిస్తుంది. విలువైన వస్తువులు, వాహనం జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. గురు, శుక్ర వారాల్లో ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. కొత్త పరిచయాలేర్పడుతాయి. ప్రముఖులకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పారిశ్రామిక రంగాలవారికి ప్రోత్సాహకరం. కాంట్రాక్టులు లాభిస్తాయి. షేర్ల క్రయవిక్రయాలకు అనుకూలం. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వస్త్రప్రాప్తి, వాహనం యోగం ఉన్నాయి. మీపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. వ్యవహారాలను సమర్థంగా నడిపిస్తారు. సర్వత్రా అనుకూలతలున్నాయి. ఉత్సాహంగా గడుపుతారు. దుబారా ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. శనివారం నాడు దూకుడు అదుపు చేయండి. దంపతులకు కొత్త ఆలోచనులు స్పురిస్తాయి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. శుభకార్యం యత్నం ఫలిస్తుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. వృత్తుల వారికి సామాన్యం. పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. కళా, క్రీడాకారులకు ప్రోత్సాహకరం.   
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ప్రముఖుల సందర్శనం వీలుకాదు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రాబడిపై దృష్టి పెడతారు. కలిసివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. ఆది, సోమ వారాల్లో పనులు మొండిగా పూర్తిచేస్తారు. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం కదలికపై దృష్టి పెట్టండి. వ్యాపారాల్లో పురోగతి అంతంత మాత్రమే. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో జాగ్రత్త. దైవదర్శనాలు ప్రశాంతతనిస్తాయి.  
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఖర్చులు సంతృప్తికరం. ఆప్తులకు సాయం అందిస్తారు. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. కష్టం ఫలిస్తుంది. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. పరిచయాలు బలపడుతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. వ్యవహారాల్లో మెళకువ వహించండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. మంగళ, బుధ వారాల్లో లౌక్యంగా మెలగాలి. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. వినోదాలు, పోటీల్లో అత్యుత్సాహం తగదు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.     
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పొదుపు ధనం గ్రహిస్తారు. పెట్టుబడులకు సమయం కాదు. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. సమర్థతను చాటుకుంటారు. అవకాశాలు వదులుకోవద్దు. పనులు వేగవంతమవుతాయి. ఆది, గురు వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. వేడుకల్లో పాల్గొంటారు. అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. చిన్నారులకు కానుకలు చదివించుకుంటారు. దైవదర్శనంలో ఇబ్బందులు తప్పవు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. క్రీడాపోటీల్లో విజయం సాధిస్తారు.   
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
గృహం సందడిగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. శ్రమ ఫలిస్తుంది. మీ నమ్మకం వమ్ముకాదు. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. ధనలాభం ఉంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మంగళ, శని వారాల్లో మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగాలి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. వేడుకను ఘనంగా చేస్తారు. అయిన వారి రాక ఉత్సాహాన్నిస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. అధికారులకు హోదామార్పు. ట్రావెలింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. జూదాల జోలికి పోవద్దు. వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. విమర్శలు, అభియోగాలు పట్టించుకోవద్దు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. సైరాశ్యం చోటు చేసుకుంటుంది. ఆశావాహ దృక్పథంతో ముందుకు సాగండి. ఆత్మీయుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. సన్నిహితుల కలయికతో కుదుటపడుతారు. దంపతుల మధ్య అవగాహనం నెలకొంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. మీ రాక సోదరులకు సంతోషాన్నిస్తుంది. గృహమార్పు కలిసివస్తుంది. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. క్రీడాపోటీలు నిరుత్సాహపరుస్తాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి.   
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2, 3 పాదాలు
కార్యసాధనలో జయం, ధనలాభం ఉన్నాయి. పెట్టుబడులపై దృష్టి పెడతారు. సంప్రదింపులు కొలిక్కివస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఉత్సాహంగా గడుపుతారు. పనులు సానుకూలమవుతాయి. శనివార ఖర్చులకు అంతుండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. గృహం సందడిగా ఉంటుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. పదవులు, ప్రసంశలు అందుకుంటారు. వైద్య, న్యాయ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వివాదాలు కొలిక్కివస్తాయి.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారానుకూలతు ఉంది. ఉల్లాసంగా గడుపుతారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. గృహం సందడిగా ఉంటుంది. వేడుకను ఘనంగా చేస్తారు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పొదుపు మూలక ధనం ముందుగా గ్రహిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. బంధువుల వైఖరి అసహానం కలిగిస్తుంది. ఎవరినీ నిందించవద్దు. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. సంస్థల స్థాపనలకు వనరులు సర్దుబాటవుతాయి. కాంట్రాక్టులు చేజారిపోతాయి. పందాలు, పోటీల్లో పాల్గొంటారు. దైవదర్శనం సంతృప్తినిస్తుంది. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
గృహంలో సందడి నెలకొంటుంది. పొదుపు పథకాలు లాభిస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. వేడుకలకు వ్యయం చేస్తారు. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. అపరిచితులతో జాగ్రత్త. సంప్రదింపులు ఫలించవు. ఊహించని సంఘటనలెదురవుతాయి. ఆలోచనులు నిలకడగా ఉండవు. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో శ్రమించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. బంధుత్వాలు బలపడుతాయి. ఆత్మీయులకు సాయం అందిస్తారు. స్త్రీల కళాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రయాణంలో అవస్థలు తప్పవు. వీడియో చూడండి...