శనివారం శివుడిని ఇలా ప్రార్థిస్తే.. నల్ల నువ్వులు, నీళ్లు..?

lord shiva
lord shiva
సెల్వి|
శనివారం రోజున ఇలా శనీశ్వరుడిని పూజించడం ద్వారా సమస్త దోషాలు తొలగిపోతాయి. నల్ల నువ్వులు, నీళ్లు శివుడికి సమర్పించి.. ఓం నమః శివాయ అని జపించాలి. ఇలా చేయడం వలన శివుడు, శని ఇరువురు వారిని పూజించిన వారి సమస్యలను తొలగిస్తారని ప్రతీతి. అంతేకాకుండా శనిదేవుడి ముందు ఆవ నూనేతో దీపం వెలిగించి.. నల్ల నువ్వులతో దీపం వెలిగించిన మంచి ఫలితం కలుగుతుంది.

అంతేకాకుండా నల్లని వస్త్రాలను ధానం చేయడంతో పాటు, నలుపు శునకాలకు ఆహారాన్ని అందించాలి. అలాగే ప్రతి శనివారం శని శాంతి మంత్ర స్తుతి అయిన క్రోడం నీలాంజన ప్రఖ్యం అనే మంత్రాన్ని 11సార్లు పఠిస్తే శనిబాధ నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే బియ్యం పిండి, పాలు, బెల్లం, అరటి పండు కలిపి ప్రమిదను తయారు చేయాలి. అందులో ఏడు వత్తులు వేసి ఆవు నేతితో దీపం వెలిగించాలి.

శనివారం శివుడు, విష్ణువులకు ప్రీతికరమైన రోజు. అందుకే వేకువజామునే లేచి తులసి కోట ముందు ఆవు నేతితో గానీ, నువ్వుల నూనెతో గానీ దీపం వెలిగించాలి. ఇలా చేసిన వారి ఇంట్లో శ్రీ లక్ష్మీ దేవి నిరంతరం కొలువుంటుందని విశ్వాసం. శనివారం రోజు శనిని పూజించే సమయంలో శివుడికి కూడా పూజ చేస్తే.. వారీ సమస్యలు తొలగి, కుటుంబం అకాల మరణం నుంచి విముక్తి పొందుతుంది అంటారు.దీనిపై మరింత చదవండి :