శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 అక్టోబరు 2023 (13:07 IST)

శరద్ పూర్ణిమ.. సాయంత్రం లక్ష్మీపూజ.. పిండి దీపం మరిచిపోవద్దు..

Lakshmi Puja
శరద్ పూర్ణిమను కోజాగిరి పూర్ణిమ అని కూడా అంటారు. ఈ శరద్ పూర్ణిమ రోజున లక్ష్మీదేవి పూజకు విశిష్టత వుంది. ఆమెను పూజించే వారికి లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వాసం. 
 
ఈ ఏడాది శరద్ పూర్ణిమ అక్టోబర్ 28న తెల్లవారు జామున  4.17 గంటలకు ప్రారంభమై.. అక్టోబర్ 29 తెల్లవారుజామున 1.53 గంటలకు ముగియనుంది. 
 
ఈ రోజున లక్ష్మీపూజతో పాటు ఉపవాసం వుండటం మంచిది. రోజంతా ఉపవాసం వుండి రాత్రి పూట పున్నమి చంద్రుడిని చూసిన తర్వాత పాలను ప్రసాదంగా స్వీకరిస్తారు. 
 
శరద్ పూర్ణిమ రోజున ఉపవాసం చేసేవారు కేవలం పండ్లు, నీటిని మాత్రమే ఆహారంగా తీసుకోవాల్సి వుంటుంది. ఈ రోజున తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి. అలాగే సాయంత్రం పూట పిండి దీపం వెలిగించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి.