స్కంధ షష్టి వ్రతం చేస్తే ఏంటి ఫలితం?
కార్తీకేయుడిని సుబ్రహ్మణ్య స్వామి అని, స్కంధుడు అని పిలుస్తారు. శివపార్వతుల సంతానం అయిన కుమార స్వామిని పూజిస్తే సర్వం సిద్ధిస్తుందని ఐతిహ్యం. అలాగే స్కంధ షష్ఠి సందర్భంగా ఆయనను పూజించి, వ్రతం ఆచరించే వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి.
స్కంద షష్టి రోజున మురుగుడు రాక్షసుడు, సూరపద్మను సంహరిస్తాడు. అందువల్ల, స్కంద షష్టి మురుగ ఆరాధనకు చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. భక్తులు వ్రతాన్ని (ఉపవాసం) ఆచరించి.. ఆయన అనుగ్రహం పొందుతారు.
భక్తులు ఇంట్లో మురుగ విగ్రహం లేదా విగ్రహాన్ని ప్రతిష్టించి, పూలతో అలంకరించి, సంప్రదాయ దీపం, నెయ్యి దీపం, ధూపం వెలిగించి, పండ్లు, తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ సందర్భంగా స్కంద పురాణం, స్కంద షష్టి కవచం వంటి శ్లోకాలు పఠించడం మంచిది. ఇంకా ఈ స్కంధ షష్ఠికి వేలాయుధాన్ని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది.
ఇంకా కుమార స్వామి ఆలయాలను సందర్శిస్తారు. భక్తులు ఉదయాన్నే ఉపవాస దీక్షను ప్రారంభించి మరుసటి రోజు సూర్యోదయం వరకు కొనసాగిస్తారు. కొందరు 6 రోజులూ ఉపవాసం వుంటారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వ్రతాన్ని ఆచరిస్తారు.
కొంతమంది ద్రవ ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు, మరికొందరు పండ్లు తీసుకుంటారు. ఆరవ శూరసంహారం రోజున ఉపవాసం పూర్తి కాగానే, తిరుకల్యాణం, ఇంద్రుడి కుమార్తె దేవసేనతో మురుగ వివాహం జరుగుతుంది.
స్కంద షష్టిలో వ్రతాన్ని (ఉపవాసం) పాటించడం వల్ల ప్రతికూల శక్తులను దూరం చేసుకోలచ్చు. కార్యాల్లో అడ్డంకులను అధిగమించడానికి ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు.
ఈ సందర్భంగా స్కంద షష్టి కవచం శ్లోకం పఠించడం వల్ల మంచి ఆరోగ్యం, సంపద చేకూరుతుంది. కుజ దోషాలను తొలగిస్తుంది.
జీవితంలో ఏర్పడే సమస్యలను దృఢ సంకల్పంతో ఎదుర్కొని సమస్యలపై విజయం సాధించే ధైర్యాన్ని ఈ వ్రతం ప్రసాదిస్తుంది. పాపకర్మలను ఈ వ్రతం తొలగిస్తుంది.