గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 1 నవంబరు 2024 (20:00 IST)

01-11-2024 నుంచి 30-11-2024 వరకు మీ మాస ఫలితాలు

monthly horoscope
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
కార్యసిద్ధి, వ్యవహార జయం ఉన్నాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. కీలక పత్రాలు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. ఒత్తిళ్లు, భేషజాలకు లొంగవద్దు. నూతన పెట్టుబడులు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు కష్టసమయం. విదేశీ సందర్శనలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఈ మాసం మిశ్రమ ఫలితాల సమ్మేళనం. ఆర్థికంగా బాగున్నా వెలితిగా ఉంటుంది. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఆహ్వానం అందుకుంటారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. అవతలివారి స్థితిగతులు క్షుణ్ణంగా తెలుసుకోండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు అనివార్యం. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. పరిశ్రమల స్థాపనకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆదాయం బాగుంటుంది. దైవకార్యాలు, వనసమారాధనల్లో పాల్గొంటారు. 
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సర్వత్రా అనుకూలమే. లక్ష్యాన్ని సాధిస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. గృహంలో సందడి నెలకొంటుంది. ఖర్చులు భారమనిపించవు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. పరిశ్రమల స్థాపనలకు అనుమతులు లభిస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వేడుకలు, విందుల్లో అత్యుత్సాహం తగదు. 
 
కర్కాటక రాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వండి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానానికి శుభఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. గృహనిర్మాణాలకు అడ్డంకులు తొలగుతాయి. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. ఉపాధి పథకాలు చేపడతారు. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ మాసం కలిసివచ్చే సమయం. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. తరచు ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కీలకపత్రాలు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పనులు సానుకూలమవుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. అనురాగవాత్యల్యాలు వెల్లివిరుస్తాయి. మంగళవారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. అవతలి వారి స్థోమతు గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి. ఫోన్ సందేశాలకు స్పందించవద్దు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు. సహోద్యోగుల చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతికూలతలు అధికం. అప్రమత్తంగా వ్యవహరించాలి. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటం ముఖ్యం. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఆదాయానికి తగ్గుట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. బుధవారం నాడు ఆప్రియమైన వార్త వినవలసి వస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇబ్బండి. ఒంటెద్దుపోకడ తగదు. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజాన్నిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త పథకాలు రూపొందిస్తారు. వాహనదారులకు దూకుడు తగదు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులు కలిసిరావు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. గురు, శుక్రవారాల్లో మితంగా సంభాషించండి. వాగ్వాదాలకు దిగవద్దు. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానానికి శుభపరిణామాలున్నాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. అధికారులకు ఆకస్మిక స్థానచలనం. సన్మాన, సంస్కరణ సభల్లో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సర్వత్రా అనుకూలమే. కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. అయిన వారితో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహయత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు బలపడతాయి. మధ్యవర్తులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. వాహనం, విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు. వ్యాపారాల్లో ఒడుదుడుకులను అధిగమిస్తారు. చిన్నవ్యాపారులకు ఆదాయం బాగుంటుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాల్లో మార్పు ఉండదు. ఉపాధి పథకాలు చేపడతారు. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆటంకాలను ధైర్యంగా ఎదుర్కుంటారు. ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త వహించండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. వాయిదాల చెల్లింపుల్లో ఆశ్రద్ధ తగదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో తరచూ సంభాషిస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. ఆహ్వానం అందుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదవులు దక్కవు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. వ్యతిరేకులతో జాగ్రత్త. వ్యవహార లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. ఆదాయం సంతృప్తికరం. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతలపై దృష్టి పెట్టండి. ప్రలోభాలకు లొంగవద్దు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శనలకు యత్నాలు సాగిస్తారు.