శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 మే 2021 (16:28 IST)

తరుణ గణపతిని సంకష్టహర చతుర్థి రోజున పూజిస్తే?

Taruna Ganapathi
అనుకున్న పనులన్నీ నెరవేరడం కోసం చక్కని పరిష్కారం తరుణ గణపతిని పూజించడం. వినాయకుని ముప్ఫైరెండు రూపాలలో తరుణ గణపతి రూపం రెండవది. తరుణ అంటే యవ్వనం అని అర్థం. తరుణ గణపతి రూపంలో వినాయకుడు యవ్వన కాంతితో విరాజిల్లుతాడు. 
 
ఈ రూపంలో స్వామికి ఎనిమిది చేతులు ఉంటాయి. కుడిపక్కన ఒక చేతిలో దంతాన్ని, మరొకచేత జామపండుని, ఒక చేత చెరుకు గడలని, మరొక చేత అంకుశాన్ని ధరించి ఉంటాడు. ఎడమవైపున ఒకచేత మోదకాన్ని, ఒకచేత వెలగ పండునీ, ఒకచేత లేత మొక్కజొన్న కంకుల పొత్తినీ, మరొక చేత వలనీ ధరించి ఉంటాడు.
 
తరుణ గణపతి శరీరం కాంతివంతంగా ఎర్రని రంగులో ఉంటుంది. ఎరుపు ఉత్తేజానికీ యవ్వనానికీ ప్రతీక. మధ్యాహ్న కాలపు సూర్యుని తేజస్సుతో తరుణ గణపతి దర్శనమిస్తాడు. 
 
వినాయకునికి ప్రీతికరమైన బుధవారం నాడు, సంకష్ట చతుర్థినాడు, వినాయక చవితినాడు, దూర్వా గణపతి వ్రతం నాడు స్వామిని తరుణ గణపతి రూపంలో పూజించడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఆటంకాలు తొలగుతాయి. అనుకున్న కార్యాలు సత్వరం నెరవేరతాయి.
 
స్కాంద పురాణం లోనూ, బ్రహ్మ పురాణంలోనూ,వామన పురాణంలోనూ ముద్గళ పురాణంలోనూ తరుణ గణపతిని గురించిన ప్రస్తావన ఉంటుంది.
 
2. తరుణ గణపతి ధ్యానం
అథ తరుణ గణపతి ధ్యానం ముద్గళ పురాణే
శ్రీ తరుణ గణపతి ధ్యానం
పాశాంకుశాపూపకపిద్థజంబూ
స్వదంతశాలీక్షుమపి స్వహస్తైః |
ధత్తే సదా యస్తరుణారుణాభః
పాయాత్స యుష్మాం స్తరుణో గణేశః || 1 || 
ప్రతిరోజూ ఉదయం స్నానాదికాలు ముగించుకుని, శుభ్రమైన వస్త్రాలను ధరించి, తరుణ గణపతి ధ్యానం చేయడం వలన సర్వకార్య సిద్ధి కలుగుతుంది.