బుధవారం, 11 సెప్టెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 4 ఆగస్టు 2024 (19:26 IST)

ఉత్తరేణి మొక్కతో ఇంత మేలుందా..? జ్యోతిష్యం ఏం చెప్తోంది.?

Uttareni
Uttareni
పౌర్ణమి రోజు ఉదయం ఉత్తరేణి మొక్క మూలానికి పంచోపచార పూజ చేయడం ఉత్తమ ఫలితం ఉంటుంది. ఇలా చేస్తే జీవితంలోని అతి పెద్ద సమస్యల నుంచి త్వరగా బయటపడతారు. వినాయక చవితికి వాడే పత్రిలోనూ ఈ ఉత్తరేణిని ఉపయోగిస్తారు. 
 
జ్యోతిష్యంలోనూ దీనికి ప్రాధాన్యత ఉంది. ఉత్తరేణికి ఔషధ గుణాలు మాత్రమే కాకుండా యజ్ఞ-పూజలకు అవసరమైన మొక్క. దీని వేరుని మణికట్టు లేదా చేతిపై తాయెత్తు రూపంలో కట్టుకుంటే జీవితంలోని అతి పెద్ద సమస్యల నుంచి త్వరగా బయటపడతారు. 
 
తెల్లటి ఉత్తరేణి మొక్క ఇంట్లో ఉంటే ఆనందం, శ్రేయస్సు వృద్ధి చెందుతాయట. చెడు దృష్టి నుంచి ఈ ఉత్తరేణి మొక్క వేర్లను పూజించి కుడి చేతికి ధరించాలట.
 
ఉత్తరేణి చెట్టు వేరును శుభ ముహార్తంలో ఇంట్లో సురక్షితమైన స్థలంలో పెడితే ఆహారం, ధనప్రాప్తి కలుగుతుంది. జీవితంలో లోటు ఉండదు. 
 
ఉబ్బసం దగ్గుతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఉత్తరేణి చెట్టు ఎండిన ఆకులను నిప్పులపైన వేసి ఆ పొగ పీల్చితే దగ్గు, ఆయాసం తగ్గుతాయి. ఉత్తరేణి ఆకులను కాల్చి బూడిద చేసి దానిని ఆముదముతో కలిపి గజ్జి, తామర ఉన్నచోట లేపనంగా చేయడం వల్ల అవి క్రమంగా తగ్గి పోతాయి.