1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 మే 2024 (17:42 IST)

కూర్మ జయంతి... సేమియాతో స్వీట్లు, పండ్లు.. విష్ణు సహస్రనామాన్ని..?

కూర్మ జయంతి అనేది విష్ణువు భక్తులకు ముఖ్యమైన రోజు. ఈ సంవత్సరం, కూర్మ జయంతి వైశాఖ పూర్ణిమ, బుద్ధ పూర్ణిమతో వస్తోంది. పూర్ణిమ తిథి మే 22న సాయంత్రం 6:47 గంటలకు ప్రారంభమై మే 23న రాత్రి 7:22 గంటలకు ముగుస్తుంది. 
 
సముద్ర మథనం సమయంలో, విష్ణువు కూర్మగా రూపాంతరం చెందాడు. ఈ రోజున తులసీ ఆకులు, గంధం, పువ్వులు, స్వీట్లు, పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా సేమియాతో చేసిన తీపి వంటకాలు నైవేద్యంగా సమర్పించాలి.  
 
ఈ రోజున భక్తులు తృణధాన్యాలు, పప్పులకు దూరంగా ఉండి ఉపవాసం చేపట్టాలి. చాలామంది రాత్రంతా మేల్కొని జాగరణ చేస్తూ.. విష్ణు సహస్రనామాన్ని పఠిస్తారు.