పూజగదిలో చెంబు పాత్రలో నీటిని ఎందుకు వుంచాలి..??
copper Water
రాగి చెంబులో మంచినీటిని వుంచి మంత్ర పఠనం చేశాక ఆ నీటిని సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలుండవు. ప్రతిరోజు పూజ సమయంలో నీటిని వుంచి.. తీర్థంగా సేవిస్తే సమస్త దోషాలుండవు. ఈ నీటిని రోజు మార్చి రోజు చెట్లకు పోయడం చేస్తుండాలి.
ఇలా చేస్తే ఆ ఇంట వున్న నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. అలాగే పూజ చేసేటప్పుడు గంటను మోగించడం కూడా దుష్ట శక్తులను, ప్రతికూల శక్తులను పారద్రోలేందుకేనని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అలాగే పూజ సమయంలో ప్రకృతిని, పంచభూతాలను ఆరాధించడం ద్వారా ప్రతికూల శక్తులతో ఇబ్బందులుండవు.
