సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 జనవరి 2021 (22:13 IST)

పసుపు, పుట్టగొడుగులను వాడటం మరిచిపోతే..?

Turmeric_Mushroom
పసుపును, పుట్టగొడుగులను ఉపయోగించి చేసే వంటకాలను తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా కరోనా లాంటి వ్యాధులు దరిచేరవు. ఇవి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పుట్టగొడుగులు కరోనా వైరస్‌ను కట్టడి చేసే ఔషధాల తయారీలో ఉపయోగపడుతున్నాయి.
 
అలాగే శీతాకాలంలో జలుబుతో బాధ పడుతున్న సమయంలో సాధారణ నీటిని తాగటం కంటే వేడినీటికి ప్రాధాన్యత ఇవ్వాలి. వేడినీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగినా ఇమ్యూనిటీ పెరిగి మంచి ఫలితం ఉంటుంది. నీటిలో దాల్చినపొడిని కలిపి తీసుకోవడం ద్వారా కూడా వీలైనంత తక్కువ సమయంలో జలుబు నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు.
 
జలుబును త్వరగా తగ్గించుకోవడానికి ఆవిరి పట్టడం ద్వారా పరిష్కారం లభిస్తుంది. ఆవిరి పట్టడం ద్వారా ముక్కులో మూసుకుపోయిన రంధ్రాలు తెరుచుకోవడంతో పాటు తక్కువ సమయంలో మంచి ఫలితం ఉంటుంది. ఆవిరి పట్టే సమయంలో జండూబామ్, పసుపు, యూకలిప్టస్ ఆయిల్ లాంటివి వినియోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పసుపు కలుపుకుని తాగిన పాలు సైతం ఈ జలుబు సమస్య నుంచి తక్కువ సమయంలో మనకు ఇమ్యూనిటీని ఇస్తాయి.
 
జలుబుతో బాధ పడేవాళ్లలో చాలామందిని తుమ్ముల సమస్య కూడా వేధిస్తూ ఉంటుంది. జలుబు ఉన్నవారు తులసిని తీసుకుంటే తుమ్ముల సమస్య తక్కువ సమయంలో తగ్గుముఖం పడుతుంది. తులసి తీసుకోవడం వల్ల దగ్గు, జలుబుతో పాటు నోటి నుంచి వచ్చే దుర్వాసన సమస్య నుంచి సైతం బయటపడవచ్చు. మిరియాల పాలు సైతం జలుబును త్వరగా తగ్గించడంలో సహాయపడతాయి.