మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : మంగళవారం, 3 జనవరి 2017 (17:19 IST)

శునకాలు ఏడిస్తే.. మరణాలు సంభవిస్తాయా? యమధర్మరాజు రాకకు సంకేతమా?

అశుభ సంకేతాలను, ప్రకృతీ వైపరీత్యాలను పశుపక్ష్యాదులు, మూగజీవులు సులభంగా గ్రహిస్తాయి. అలాంటి మూగజీవుల్లో ఒకటైన శునకం.. పెంపుడు జంతువు. ఇంకా విశ్వాసానికి మారుపేరు. అలాంటి శునకం రాత్రిపూట లేదా పగటి పూట మూ

అశుభ సంకేతాలను, ప్రకృతీ వైపరీత్యాలను పశుపక్ష్యాదులు, మూగజీవులు సులభంగా గ్రహిస్తాయి. అలాంటి మూగజీవుల్లో ఒకటైన శునకం.. పెంపుడు జంతువు. ఇంకా విశ్వాసానికి మారుపేరు. అలాంటి శునకం రాత్రిపూట లేదా పగటి పూట మూలిగితే.. లేదా ఏడ్చినట్లైతే మరణాలు సంభవిస్తాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. శునకాలు ఇలా చేయడం యమధర్మరాజు వస్తున్న సంకేతంగా భావించాలని వారు చెప్తున్నారు. 
 
ప్రకృతిని, భగవంతుడి ఉనికి గ్రహించే శక్తి మానవుల్లో అంతగా ఉండదని.. అదే మూగజీవుల్లో ఆ శక్తి దాగివుంటుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ఇంకా శునకాలకు దివ్య, దుష్టశక్తులు కనిపిస్తాయట. ఇక పశుపక్ష్యాదుల్లోనూ అతీత శక్తులుంటాయని.. మనిషి గుర్తించలేని ఎన్నో విషయాలను అవి గ్రహిస్తాయట. శునకాలకు ఏడ్వడం.. అరుస్తూ వుండటం, మూలగడం వంటివి చేస్తే అశుభ సంకేతమని భావించాలని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.