శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Selvi
Last Updated : బుధవారం, 21 జూన్ 2017 (14:44 IST)

తమలపాకు కాడను ఎందుకు తుంచేయాలి.. సిల్వర్ పాత్రల్లో నైవేద్యం పెట్టొచ్చా?

పూజగదిలో.. లేకుంటే ఇంట్లో దేవుని పటాలు తూర్పు వైపును చూసినట్లు ఉంచాలి. దేవతా పూజ చేసేవారు.. పడమర వైపు నిల్చుని.. ఉత్తరం వైపు చూస్తున్నట్లు కూర్చుని పూజించాలి. దక్షిణం వైపున చూసేట్లు దేవుని పటాలను ఉంచక

పూజగదిలో.. లేకుంటే ఇంట్లో దేవుని పటాలు తూర్పు వైపును చూసినట్లు ఉంచాలి. దేవతా పూజ చేసేవారు.. పడమర వైపు నిల్చుని.. ఉత్తరం వైపు చూస్తున్నట్లు కూర్చుని పూజించాలి. దక్షిణం వైపున చూసేట్లు దేవుని పటాలను ఉంచకూడదు. ఇతర దిశలలో దేవుని పటాలను ఉపయోగించుకోవచ్చు.
 
దేవునికి సమర్పించే తాంబూలంలో తమలపాకు కాడను ఎందుకు తీసిపారేయాలంటే.. తమలపాకు చివర్లో లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతీ దేవీ, కాడలో మూదేవి నివసిస్తుంది. అందుకే దేవునికి తాంబూలాన్ని సమర్పించేటప్పుడు తమలపాకు కాడను తీసిపారేస్తారు. ఇంకా తమలపాకు కాడను తీసేసి.. ఆకులను నీటిలో కడిగి శుభ్రపరిచాకే పూజకు ఉపయోగించాలి. 
 
తమలపాకుకు అగ్రభాగంలో ఇంద్రుడు శుక్రుడు ఉంటారు. మధ్యలో సరస్వతి, చివర్లో మహాలక్ష్మీ వుంటారు. విష్ణుమూర్తి తమలపాకులో కొలువై వుంటాడు. శివుడు, కామదేవుడు తమలపాకుకు వెలుపల వుంటారు. పార్వతీ దేవీ, మాంగల్య దేవీలు తమలపాకుకు ఎడమవైపు వుంటారు. భూదేవి ఆకుకు కుడివైపున నివసిస్తుంది. అందుకే తమలపాకులు పవిత్రమైనవి. ఈ ఆకులను దేవునికి సమర్పించే ముందు మూడాకులు లేదా ఐదాకులు ఉంచాలు. సుమంగళీ మహిళలు తప్పకుండా తాంబూలాన్ని స్వీకరించాలి. మూడాకులు లేదా ఐదాకులు (తమలపాకులు) పెట్టి తాంబూలం ఇవ్వాలి. 
 
ఇకపోతే.. పూజ చేసేటప్పుడు దేవుని చిత్ర పటాల్లోని స్వామివారి పాదాలను, ముఖాలను పుష్పాలతో కప్పేయడం కూడదు. స్వామి విగ్రహాలను పక్కపక్కనే వుంచకూడదు. స్వామి పటాలకు, విగ్రహాలకు మధ్య కాస్త గ్యాప్ వుండేలా చూసుకోవాలి. స్వామివారికి నైవేద్యంగా పెట్టే ఆహార పదార్థాలు సిల్వర్ పాత్రల్లో నేరుగా సమర్పించకూడదు. అరటి ఆకుల్లోనే స్వామికి నైవేద్యం పెట్టాలి. అలాగే నైవేద్యానికి ఉపయోగించే అరటి ఆకు చెట్టు నుంచి కత్తిరించిన కాడ పూజగదికి కుడి పక్కన ఉండేలా చూసుకోవాలి. ఆపై నైవేద్యం పెట్టాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.