1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
  4. husband wife Dont fight in public place

పబ్లిక్‌లో గొడవపడే కపుల్సా మీరు.. జాగ్రత్త..?

husband
పబ్లిక్‌లో ఒకరిపై ఒకరు గొడవపడే కపుల్సా మీరు.. అయితే కాస్త తగ్గండి. దంపతుల మధ్య జగడాలు సహజమే. కానీ వాటిని పబ్లిక్ ప్లేసుల్లో తెలియపరచకూడదు. కొన్ని సందర్భాల్లో ఇష్టం లేని వాటిని కూడా అంగీకరించాల్సి వస్తుంది. 
 
అలాంటప్పుడే భార్యాభర్తల మధ్య సంబంధాలు బలపడతాయి. చాలా మంది జంటలు చిన్న చిన్న విషయాలకు కూడా పోట్లాటకు రెడీ అవుతుంటారు. అయితే మీ సమస్యలను బహిరంగంగా పరిష్కరించుకోవాలనుకోకూడదు. మీరు బహిరంగంగా ఏది మాట్లాడినా అది మీకు అప్రతిష్టపాలు అవ్వడానికి అధిక మార్గం చూపుతుందని మానసిక నిపుణులు అంటున్నారు. 
 
కొన్ని సందర్భాల్లో జాలి, దయ గుణాలు బాగా పని చేస్తాయి. అందుచేత మీ భాగస్వామిపై జాలితో మెలగండి. ఫాస్ట్ లైఫ్‌లో మిమ్మల్ని పట్టించుకోవడం కాస్త మరిచిపోయినా ఒకరికొకరు సమస్యల్ని సృష్టించకుండా సర్దుకుపోవడం.. కష్టనష్టాలను తెలుసుకోవడం చేయాలి. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య పోట్లాటకు సమయం ఉండదని సైకాలజిస్టులు అంటున్నారు.

ఇంకా ఇతర విశేషాలను మీ మొబైల్‌లో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
About Writer
Selvi