Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాములా మనిషి పగబడితే ఏమవుతుంది..?

Written By జె
Updated: గురువారం, 4 ఏప్రియల్ 2019 (19:47 IST)
కోపానికి పుట్టిన బిడ్డ పగ. ఇది చాలా ప్రమాదకరమైనది. అందుకే పగ ఉన్న మనిషిని పాము ఉన్న ఇంటితో పోల్చాడు కవి తిక్కన మహాభారతంలో. ఎందుకంటే మనస్సులో ఎవరిమీదైనా పగ ఉంటే వారు స్థిమితంగా ఉండలేరు. ఎదుటివారిని స్థిమితంగా ఉండనివ్వరు కూడా. పగబట్టిన వారు తమ అభివృద్ధి మీద తమ బాగోగుల గురించి పట్టించుకోకుండా తాము పగబట్టిన వారిని నాశనం చేయడం కోసమే ఎదురుచూస్తూ ఉంటారు. 
 
పగ నివురుగప్పిన నిప్పులా మనిషిని దహించి వేస్తూ ఉంటుంది. ఎవరి మీదైనా పగబట్టిన వారు వారిని చావు దెబ్బ తీయాలని, సర్వనాశనం చేయాలని ఎదురుచూస్తూ చివరకు తమకు తామే చేటు తెచ్చుకుంటారు. శాస్త్రీయమైన ఆధారాలు లేనప్పటికీ పాము ఎవరిమీదైనా పగబట్టిందో నిర్ణీత గడువులోగా ఆ పగ తీర్చుకోలేకపోతే నోటి ముందుకు వచ్చిన ఆహారాన్ని కూడా తినడం మానేసి ఆకలితో క్రుంగి కృశించి చివరకు తన తలను నేలకేసి కొట్టుకుని చచ్చిపోతుందని అంటారు. 
 
పాము విషయానికి సంబంధించి ఇది నిజమో కాదో పక్కనబెడితే అర్థంపర్థం లేని పగలు, ప్రతీకారాల వల్ల అవతలివారి నిండుప్రాణాలను తీయడానికి ప్రయత్నించడంతో పాటు అవసరమైతే ఏదో ఒకటి చేసుకుంటారు చాలామంది. అందుకే పగను ప్రేమతో, శాంతంతో, క్షమతో తరిమికొట్టాలట. ప్రేమతో సాధించలేనిది ఈ భూమి మీద ఏదీ లేదని మనం గ్రహించాలి. ప్రేమను పంచితే పోయేదేముంది?

అన్నీ చూడండి

ఉగ్రవాదంపై అందరికీ ఒకే మాట ఉండాలి.. ఉగ్రవాదం వ్యూహాత్మక సంపద కాదు: ప్రధాని మోడీ

అమెరికాలో అమ్మాయి పెళ్లి.. సూర్యాపేటలో వీడియో కాల్ ద్వారా ఆశీర్వదించిన తల్లిదండ్రులు (video)

ప్రపంచం తడబడుతోంది.. కానీ భారత్ దూసుకెళుతోంది : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

చంబా జిల్లాలో ఆకస్మిక వరదలు - చున్నీతో బైకర్‌ను రక్షించిన నవ వధువు (Video)

పెళ్లికి నిరాకరించిన నర్సింగ్ విద్యార్థినిని 11 సార్లు కత్తితో పొడిచి చంపిన ప్రేమోన్మాది, వీడియో

అన్నీ చూడండి

చిరంజీవి గారి వల్లే డాన్సర్స్ సమస్యలకు పరిష్కారం: సుమలత

Karthi: ఏజెంట్ బోస్ గా కార్తీ నటించిన సర్దార్ 2 అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా విడుదల

హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న మూవీ హతః టైటిల్ ప్రకటన

NBK111 ఫ నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని టైటిల్ & రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్

Kaala Bhairava: కావ్య కళ్యాణ్‌రామ్, కాల భైరవ ఇస్టపడ్డారు త్వరలో పెండ్లి

తర్వాతి కథనం
Show comments