బుధవారం, 4 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (14:14 IST)

ఒత్తిడికి లోనవుతున్నారా? ఎక్కువ నీరు తాగండి.. సెల్ఫ్ మోటివేషన్ అలవరుచుకోండి..

బిజీ లైఫ్.. హడావుడిగా ఉరుకులు పరుగులు తీస్తున్నారా? రోజూవారీ పనితో ఒత్తిడికి లోనవుతున్నారా? అయితే ఒత్తిడిని అధిగమించాలంటే.. ఈ టిప్స్ పాటించండి. రోజూ 6-10 గ్లాసుల నీరు తాగండి. నీరు తక్కువగా తీసుకుంటే శ

బిజీ లైఫ్.. హడావుడిగా ఉరుకులు పరుగులు తీస్తున్నారా? రోజూవారీ పనితో ఒత్తిడికి లోనవుతున్నారా? అయితే ఒత్తిడిని అధిగమించాలంటే.. ఈ టిప్స్ పాటించండి. రోజూ 6-10 గ్లాసుల నీరు తాగండి. నీరు తక్కువగా తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఇది ఒత్తిడికి కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

కొందరు ఒత్తిడిలో కూడా బాగా పనిచేయగలుగుతారు. మరికొందరు కొంచెం ఒత్తిడి ఉన్నా పని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. అటువంటి వారు సెల్ఫ్ మోటివేషన్ అలవాటు చేసుకోవాలి.
 
అలాంటప్పుడు ఒత్తిడిని అధిగమించేందుకు మెడిటేషన్, రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉపయోగపడతాయి. మసాజ్ కూడా శరీరానికి ఆహ్లాదాన్నిచ్చి ఒత్తిడిని దూరం చేస్తుంది. వ్యాయామం చేయడం ద్వారా అధిక బరువు తగ్గుతుంది. ఒత్తిడిని నియంత్రించుకోవాలంటే.. బరువు తగ్గడం కూడా చేయాలి. ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి పనిలో ఆటంకం ఉండదు. ఓ ప్రణాళిక పరంగా ముందుకు వెళ్లడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.
 
సమయపాలన.. ఏ పనికి ఎంత సమయం కేటాయించాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరుసటి రోజు చేయాల్సిన పనుల్ని కూడా రాసుకోవాలి. అందులో ముఖ్యమైన పనికి తొలుత ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా రాసుకోవడం ద్వారా ఏ పనికి ఎంత టైమ్ పడుతుందో అర్థమైపోతుంది. ఇంకా టైమ్ వృధా అవుతుండటాన్ని గమనించవచ్చు.

తప్పులను సరిదిద్దుకోవచ్చునని సైకాలజిస్టులు అంటున్నారు. అలాగే వారంలో ఒక గంట సామాజిక సేవకు కేటాయిస్తే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మార్పు లభిస్తుందని వారు సూచిస్తున్నారు.