ఒంటరిని అనే భావన ఎందుకు కలుగుతుంది?

మంగళవారం, 25 డిశెంబరు 2018 (20:41 IST)
మన జీవితకాలంలో ఏదో ఒకసారి ఒంటరిగా ఉన్నాం అన్న భావనకు గురవుతుంటాము. చుట్టూ వందలాది జనం ఉన్నా కూడా ఒంటరిని అన్న భావన మనలో కలుగుతుంది. అలా అనిపించుటకు కారణాలేంటో, అవి ఎలా తగ్గించుకోవాలో  తెలుసుకుందాం.
 
1. శక్తి మరియు సామర్థ్యం తెలియక పోవటం వలన విశ్వాసం కోల్పోతారు. ఇతరులతో పోలుస్తూ స్వతహాగా తక్కువ అంచనా వేసుకోవటం వలన ఒంటరిని అన్న భావనకు లోనయ్యే అవకాశం ఉంది. దీని వలన కుటుంబం మరియు స్నేహితులు మద్దతు తెలిపినా ఒంటరిని అన్న భావనకు లోనయ్యే అవకాశం ఉంది.
 
2. అధికంగా ఆశించటం వలన కూడా మనం బాధపడాల్సి వస్తుంది మరియు ఒంటరిగా ఉన్నాం అన్న భావనకు కూడా లోనవుతాము. సామర్థ్యానికి మించిన ప్రతిఫలం ఆశించి ఎక్కువగా ప్రయత్నించటం వలన ఎక్కడికో చేరుకుంటారు, ఫలితంగా వెళ్ళే దారిలో ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తుంది.
 
3. అహంకారం అనేది మంచి విషయమే కానీ, సొంత నిర్ణయాల పట్ల అహంకారంగా వ్యవహరించటం లేదా ఇతరులపై ఆధిపత్యం చెలాయించడానికి అహంకారంగా వ్యవహరించటం మంచిది కాదు. చుట్టూ ఉండే వారు ఇలాంటి వారికి దూరంగా ఉండటం లేదా వారితో మాట్లాడకపోవటం వంటి చేయవచ్చు. చివరకి, మీతో ఉండటానికి ఎవరు ఇష్టపడరు మరియు ఉండలేరు.
 
4. మన ఆత్మీయుల ఉండే సంబంధం చివరి రోజుకు చేరుకోగానే మనందరికీ బాధగానే ఉంటుంది. విడిపోయిన బంధం వలన మన మనసు ఒంటరి అన్న భావనకు గురవుతుంది మరియు ఈ స్థితి కోలుకోటానికి సమయం పడుతుంది. కుటుంబ కారణాల వలన లేదా నమ్మక ద్రోహం వంటి కారణాల ఫలితంగా ఒక స్నేహితుడిని కోల్పోవటం లేదా అతడు లేదా ఆమెతో ఉన్న బంధాన్ని కోల్పోవటం వలన చుట్టూ ఎంతమంది ఉన్నా మనం ఒంటరి అనే భావన వెంటాడుతూనే ఉంటుంది.
 
5. ఈ సమస్య నుండి బయటపడాలంటే.... ముందు అందరితో స్నేహపూర్వకంగా మెలగాలి. ఆధ్యాత్మికత గ్రంధాలను ఎక్కువగా చదవాలి. చదివిన వాటిని ఎల్లప్పుడు మననం చేయడం, భక్తి, సామాజిక సేవా కార్యాక్రమాలల్లో స్వతహాగా పాల్గొనడం, రోజులో ఒక గంట అయినా ధ్యానం, యోగా లాంటివి చేయడం వల్ల మానసిక ప్రశాంతతను పొందగలరు. ఇలా చేయడం వల్ల ఒంటరితనం అనే భావనను తొలగించుకోవచ్చు.

అన్నీ చూడండి

ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదం, ఫార్చునర్ కారు డివైడర్‌ను ఢీకొని మరో కారుని ఢీకొట్టింది, ఇద్దరు మృతి

జూలై 19, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

బంజారాహిల్స్ కేబీఆర్ పార్కులో 20 అడుగుల కొండచిలువ కలకలం, వీడియో

మహిళా పారిశ్రామికవేత్తలతో ప్రతి మూడు నెలలకోసారి సమావేశం నిర్వహిస్తా: సీఎం రేవంత్ రెడ్డి

Vizag: 1.7 కిలోల బరువున్న శిశువుకు అరుదైన మెదడుకు శస్త్ర చికిత్స

అన్నీ చూడండి

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న బ్రహ్మయుగం

New Delhi: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడింది

L.B. Sriram: ఆలస్యంగా గుర్తించినందుకు అవమానంగా ఉంది : ఎల్. బి. శ్రీరామ్

Ali: బద్రి లోని హే చికీతా పాట పెద్ద హిట్ అయిందో ఈ సినిమా హిట్ : అలీ

Soori: సుహాస్, సూరి నటించిన మండాడి చిత్రాన్ని విడుదలచేస్తున్న మైత్రి డిస్ట్రిబ్యూటర్స్

తర్వాతి కథనం
Show comments