శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 16 డిశెంబరు 2018 (16:32 IST)

ఒక్క యేడాది ఫోన్ వాడకుంటే రూ.72 లక్షల బహుమతి... ఎక్కడ? ఏంటి?

ఒక్క యేడాది పాటు ఫోన్ వాడకుండే రూ.72 లక్షల రూపాయల బహుమతి ఇస్తామని విటమిన్ వాటర్ కంపెనీ ప్రకటించింది. నో ఫోన్ ఫర్ ఏ ఇయర్ పేరిట ఓ పోటీని నిర్వహించనుంది. 
 
కోల్‌కతా కంపెనీ అనుబంధ సంస్థ అయిన విటమిన్ వాటర్ కంపెనీ ఈ పోటీలను నిర్వహిస్తోంది. సాధారణంగా ఇపుడు ఫోన్ లేకుండా ఒక్క క్షణం పాటు కూడా ఉండలేని పరిస్థితి ఉంది. అందుకే ఒక్క యేడాది పాటు ఫోన్ వాడకుండా ఉంటే రూ.72 లక్షల బహుమతి అందజేస్తామని ప్రకటించింది. 
 
ఇందులో పోటీ పడేందుకు విటమిన్‌ వాటర్‌కు చెందిన ట్విట్టర్‌, లేదా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ల ద్వారా జనవరి 8, 2019 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోటీలో పాల్గొనేవారు స్మార్ట్‌ఫోన్‌ లేకుండా సమయాన్ని ఎలా గడుపుతాం? అనే విషయాన్ని సదరు పోటీదారుడు కంపెనీకి వివరించాల్సి ఉంటుంది. 
 
పోటీదారుడు ఇచ్చే సమాధానం నచ్చితే కాంట్రాక్ట్‌ పత్రాలపై సంతకం చేయించుకుంటారు. ల్యాప్‌టాప్‌, కంప్యూటర్లను ఈ పోటీలో భాగంగా వాడుకునే వెసులుబాటు ఉంది. అయితే పోటీలో పాల్గొని చివరిదాకా కొనసాగలేని వారి కోసం విటమిన్ వాటర్ సంస్థ మరో ఆఫర్ ప్రకటించింది. 
 
కనీసం 6 నెలల పాటు ఫోన్ వాడకపోయినా రూ.7 లక్షలను ఖాతాలో జమ చేస్తామని చెబుతోంది. అన్నట్లు ఇంట్లో వాళ్లు, స్నేహితులతో మాట్లాడేందుకు 1996 నాటి సెల్యూలర్ ఫోన్‌ను కంపెనీ అందివ్వనుంది.