నిరుపేదల ఆకలి బాధలు నాకు తెలుసు.. అందుకే... రోజా(Video)

Roja
జె| Last Modified బుధవారం, 5 డిశెంబరు 2018 (19:48 IST)
రాజకీయ నాయకురాలిగా మారిన తరువాత ప్రజల సమస్యలను దగ్గర నుంచి చూస్తున్నారు రోజా. నటిగానే కాదు రాజకీయ నాయకురాలిగా కూడా తానేంటో నిరూపించుకున్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న రోజా గత నెల తన పుట్టిన రోజున 4 రూపాయలకే నిరుపేదలకు భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. తన సొంత ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు భోజనాన్ని అందిస్తూనే వస్తున్నారు.

నిన్నటికి నిన్న నిరుపేదల దగ్గర 4 రూపాయలు లేకపోయినా భోజనం ఉచితంగా వడ్డించిన రోజా నేడు స్వయంగా వంట చేశారు. మధ్యాహ్నం దగ్గరుండి తన ఇంటి సమీపంలోనే భోజనం చేయించి వ్యాన్‌లో పంపించారు రోజా. భోజనం చేసే సమయంలో ఆమె కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆకలి బాధలు నాకు తెలుసు. నేను ఎన్నో సంఘటనల్లో బాధపడ్డాను కూడా. అందుకే నేను సంపాదిస్తున్న డబ్బులో ఎంతోకొంత డబ్బును నిరుపేదల కోసం ఖర్చు పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ వైఎస్ఆర్ క్యాంటీన్‌ను నడుపుతున్నానని చెప్పారు రోజా. వంట చేస్తున్న ఎమ్మెల్యే రోజా... వీడియోలో చూడండి...దీనిపై మరింత చదవండి :