శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By
Last Updated : బుధవారం, 14 నవంబరు 2018 (18:23 IST)

ఇడ్లీ పిండిని వారాల పాటు ఫ్రిజ్‌లో భద్రపరుస్తున్నారా?

ఏ వస్తువునైనా ఒక రోజుకు పైగా ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఇడ్లీ పిండి వారాల పాటు ఫ్రిజ్‌లో ఉంచకూడదు. 48 గంటల్లోపే ఉపయోగించండి. ఫ్రిజ్‌లో నుంచి తీసిన పదార్థాలను వేడిచేసి మళ్లీ దానిని ఫ్రిజ్‌లో పెట్టకుండా చూసుకోవాలని న్యూట్రీషియన్లు చెప్తున్నారు. కూరగాయల్ని కట్ చేసి అలానే ఉంచకుండా.. ఒక కవర్లో వుంచడం మేలు. కూరగాయలు, పండ్లు, ఉడికించిన ఆహారాన్ని ఒక్క రోజు మాత్రమే ఫ్రిజ్‌లో ఉంచాలి. 
 
అనేక రోజులు అలాగే ఉంచి వేడి చేసి తినడం అనారోగ్యానికి దారితీస్తుంది. అలాగే పవర్ కట్‌తో చల్లదనం కోల్పోయే ఆహార పదార్థాల్లో బ్యాక్టీరియా సులువుగా వ్యాపిస్తుంది. మళ్లీ పవర్ వచ్చినా ఆ ఆహారంలో నాణ్యత కోల్పోతుంది. ముఖ్యంగా మాంసాహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచడాన్ని తగ్గించాలి. నాన్ వెజ్‌లో వచ్చే బ్యాక్టీరియాలు ఉదర సంబంధిత రోగాలకు దారి తీస్తుందని న్యూట్రీషియన్లు హెచ్చరిస్తున్నారు.