ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By
Last Updated : గురువారం, 25 అక్టోబరు 2018 (12:50 IST)

ఉద్యోగినులు ఇడ్లీతో పాటు ఉడికించిన గుడ్డు తీసుకుంటే..?

ఉద్యోగినులు అల్పాహారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు. ఉద్యోగినులు అల్పాహారంలో ఉడికించిన కోడిగుడ్డు, సోయాతో పాటు ఇడ్లీలు వుండేలా చూసుకోవాలి.. అంటున్నారు.. న్యూట్రీషియన్లు. అంతేగాకుండా అల్పాహారంతోపాటు ఓ గ్లాసు రాగి జావ తాగితే రోజంతా చురుగ్గా ఉంటారు. 
 
మధ్యాహ్నం భోజనంలో కూరగాయలతో చేసిన కూరలు, ఉడికించిన గుడ్డు లేదా కొంత మొత్తంలో సోయా తీసుకుంటే శరీరానికి కావల్సిన మాంసకృత్తులు అందుతాయి. సాయంత్రంపూట అల్పాహారంలో ఉడికించిన సెనగలు, పెసలు, పాప్‌కార్న్‌ ఉండేలా చూసుకుంటే పొట్ట నిండినట్లు ఉంటుంది. ఇలా చేస్తే మహిళలు బరువు పెరగరు. 
 
అలాగే అల్పాహారంలో ఇడ్లీలు వుండేలా చూసుకుంటే బరువు పెరగరు. మినుములు, బియ్యం పిండితో చేసే ఇడ్లీ బలవర్ధకం కూడా. శరీరానికి అవసరమైన ప్రొటీన్లు మినుముల్లో ఎక్కువగా ఉంటాయి. సత్వరశక్తికి బాగా ఉపయోగపడతాయి. 
 
ఇది తేలికగా జీర్ణమవుతుంది. మధుమేహంతో బాధపడేవారు, అధిక బరువుతో ఇబ్బందిపడే వారికి ఇదే సరైన ఆహారం. రోజూ ఒకేలా అనిపిస్తే.. రాగి, జొన్న పిండి కలుపుకొని ఇడ్లీలు తయారు చేసుకుని తీసుకోవచ్చునని పోషకాహార నిపుణులు చెప్తున్నారు.