మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. చిట్కాలు
Written By
Last Updated : బుధవారం, 12 డిశెంబరు 2018 (15:00 IST)

అలా మాయ చేస్తే దబ్బున ప్రేమలో పడిపోతారట...

ఏదో ఒక శుభ సందర్భాన ఓ వ్యక్తిపై మీలో ప్రేమభావం కలిగింది. కానీ ఆ వ్యక్తికి కూడా మీపై అంతే ప్రేమ ఉందా అంటే మీనుంచి సమాధానం రాకపోవచ్చు. ఎందుకంటే ఎదుటివారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అనే విషయం మీకు ఖచ్చితంగా తెలియకపోవచ్చు.
 
అసలు మిమ్మల్ని వారు ఇష్టపడుతున్నారనే విషయం మీకు తెలియకపోవచ్చు. అలాంటి సందర్భంలో మీరు తొందరపడి మీ మనసులోని భావాన్ని వారికి చెప్తే.. వారు మిమ్మల్ని ప్రేమించకపోగా మీ ప్రేమను చులకనగా భావించవచ్చు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే.. ఎదుటివారిలో మీపై ఎలాంటి భావం ఉందనే విషయాన్ని మీరు గ్రహించాలి. వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా.. లేదా అని తెలుసుకోవాలి.
 
అందుకోసం మీ మాటల్నే ఆయుధాలుగా వాడండి. మీ మాటల్తో ఎదుటి వారిని మాయ చేయండి. ఎలా చేయాలంటారా... తొలుత మీరు ప్రేమించిన వారితో మాటలు కలపండి. ఆ మాటల సందర్భంలో మీలో ఉన్న ఫ్లస్ పాయింట్స్ వారికి తెలిసేలా చేయండి. అయితే ఉద్ధేశ్యపూర్వకంగా మీరు ఆ పని చేస్తున్నట్టుగా మాత్రం ఎదుటివారికి తెలియనీయకూడదు. అలా చేస్తే మీ ప్రేమకు ఫలితం లేనట్టే.