మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (21:57 IST)

నీవు అనుభవించవలసిన ఫలితం నీకోసం కాచుకుని వుంది

నేనొక పని చేయబోతున్నాను. లాభమొస్తుందో రాదోనని, విజయం లభిస్తుందో అపజయం కలుగుతుందో నని దానివల్ల సుఖం కలుగుతుందో దుఃఖం సంభవిస్తుందోనని మనసులో ఒకే ఆందోళన. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను. తప్పుడు మార్గాలను అనుసరించక తప్పదా? నా ఆలోచన ఎలా ఉండాలి? నేనెలా నడుచుకోవాలి? ఏదీ శాంతిప్రదమైన మార్గం?
 
ఆందోళన వల్ల విజయం లభించదు. ఆందోళనతో కర్తవ్యాన్ని సరిగా నిర్వహింపలేకపోవచ్చు. అనుభవించవలసిన ఫలితం నీ కోసం కాచుకునే ఉంది. అది ఎలాగూ నిన్ను వరిస్తుంది. దాని కోసం నీవు తప్పుడు మార్గాలను అనుసరించనక్కరలేదు. సుఖదుఃఖాలను లాభనష్టాలను సమానంగా భావించు. ఏది వచ్చినా సంతోషంగా భగవత్ర్పసాదమనే భావనతో అనుభవించడానికి సిద్ధంగా ఉండు. దీనివల్ల నీలో రాగద్వేషాది దోషాలు పెరిగి పాపాలు చేసే ప్రమాదం నుంచి తప్పుకుంటావు. కర్తవ్యం మరి నీవంతు.