గురువారం, 2 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By JSK
Last Modified: మంగళవారం, 1 నవంబరు 2016 (13:57 IST)

గోదావ‌రి జిల్లాల్లో... అత్తా లెక్క ఎక్కువయినా ఫర్లేదు... వందలో ఒక్కటి మిగిలినా ఓడినట్టే అల్లుడూ...

రాజ‌మండ్రి: కార్తీక మాసం అంటే వ‌న భోజ‌నాల‌కు ప్ర‌సిద్ధి. మ‌రోప‌క్క ఈ మాసంలో ఉప‌వాసాలు ఉండే ముత్త‌యిదువ‌లు... సాయంత్రం పూజ‌లు చేసి, ఇంట్లో కొత్త అల్లుడికి, అక్కాచెల్లెళ్ళ‌కు ఇలా అరటి ఆకు నిండా భోజం వ‌డ్డించేస్తుంటారు. ఈ సంప్ర‌దాయం ఇంకా గోదావ‌రి జిల్ల

రాజ‌మండ్రి:  కార్తీక మాసం అంటే వ‌న భోజ‌నాల‌కు ప్ర‌సిద్ధి. మ‌రోప‌క్క ఈ మాసంలో ఉప‌వాసాలు ఉండే ముత్త‌యిదువ‌లు... సాయంత్రం పూజ‌లు చేసి, ఇంట్లో కొత్త అల్లుడికి, అక్కాచెల్లెళ్ళ‌కు ఇలా అరటి ఆకు నిండా భోజం వ‌డ్డించేస్తుంటారు. ఈ సంప్ర‌దాయం ఇంకా గోదావ‌రి జిల్లాల‌లో క‌నిపిస్తోంది. కొత్త అల్లుడు ఇంటికి వస్తే, ఇలా వ‌డ్డించి, గౌర‌విస్తుంటారు. 
 
పైగా, అత్తాగారంటారు... నా వంటలు వంద వండి వడ్డిస్తా. ఒక్కటి కూడా మిగలకుండా తింటే, నా కూతుర్ని, నా ఆస్తిని నీకు రాసిస్తా.... అని స‌వాళ్ళు కూడా విసురుతారు. అప్పుడు అల్లుడు అంటాడు... ఘాటుగా ఉన్నవి, స్వీటుగా ఉన్నవి, అన్నీ ఏరి మరీ వడ్డించు.... అని మ‌గ‌ధీర డైలాగు విసురుతాడు... అవి తినడమే కాదు, చూస్తేనే నీకు సగం కడుపు నిండిపోతుంది... అని ఇంట్లో వాళ్లు ఎద్దేవా చేస్తారు. అత్తా లెక్క ఎక్కువయినా ఫరవాలేదు.. తక్కువ కాకుండా చూసుకో.. అంటాడు అల్లుడు. వందలో ఒక్కటి మిగిలినా నువ్వు ఓడినట్లే అంటుంది అత్త‌గారు... చివ‌రికి అల్లుడు ఓడిపోవాల్సిందే... అదీ గోదావ‌రి జిల్లాలో మ‌ర్యాద తీరు.