1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: గురువారం, 6 ఏప్రియల్ 2017 (21:48 IST)

ఒకతె మోహించిన పురుషుణ్ణే తామూ మోహించే స్త్రీలూ...

భారతంలో విదురుడు చెప్పే నీతిలో కొద్దిగా... ఒకతె మోహించిన పురుషుణ్ణే తామూ మోహించే స్త్రీలూ, ఒకరు గౌరవించేవారినే తామూ గౌరవించే పురుషులూ పరప్రత్యయనేయ బుద్ధులు. స్వయంగా మంచిచెడ్డలు నిర్ణయించుకోలేనివారు. డబ్బు లేకుండా పెద్దపెద్ద ప్రయత్నాలు చేయదలిచేవాడూ, ఏ

భారతంలో విదురుడు చెప్పిన నీతిలో కొద్దిగా... ఒకతె మోహించిన పురుషుణ్ణే తామూ మోహించే స్త్రీలూ, ఒకరు గౌరవించేవారినే తామూ గౌరవించే పురుషులూ పరప్రత్యయనేయ బుద్ధులు. స్వయంగా మంచిచెడ్డలు నిర్ణయించుకోలేనివారు. డబ్బు లేకుండా పెద్దపెద్ద ప్రయత్నాలు చేయదలిచేవాడూ, ఏమీ చెయ్యలేని వాడైనా కోపపడేవాడూ తమకు తామే శుష్కించిపోతారు. 
 
ఏ పని చెయ్యడానికి పూనుకోని గృహస్థూ, అన్ని పనులు చెయ్యడానికి తానే సిద్ధపడే సన్యాసి, అవి విపరీత పనులు కావడం వల్ల ఎందుకూ పనికిరాకుండాపోతారు చివరికి. క్షమాగుణం వున్నవాడు ఉన్నంతలో ఒకరికిచ్చే దరిద్రుడూ స్వర్గం కంటే ఇంకా పైలోకాలు సంపాదించుకుంటారు. 
 
న్యాయంగా వచ్చిన డబ్బు, మంచివాళ్లకి దానం చెయ్యకపోవడమూ, దుర్మార్గులకు దానం చెయ్యడమూ... ఇవి రెండూ కూడా అధర్మాలే. పిల్లికి బిచ్చం వెయ్యని ధనవంతుణ్ణీ, తపస్సు చెయ్యని పేదవాడినీ మెడలో బండరాళ్లు కట్టి యేట్లే ముంచేయాలన ధర్మం.