శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Modified: గురువారం, 21 జులై 2016 (21:29 IST)

తిరుమల కొండపై నో ఫ్లై జోన్‌ కుదరదంటే ఎలా? కేంద్రమంత్రి ప్రశ్నించరా...?

శ్రీవారి ఆలయ గగనతలంపై విమానాలు ఎగరకూడదని పురాణాలు చెబుతున్నాయి. శ్రీవారి ఆలయానికి రెండువేల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. వైఖానస ఆగమ నిబంధనలకు లోబడి నిత్యపూజలతో అలరారే స్వామివారి ఆలయ పవిత్రత చాలా ముఖ్యం. ఏటా 450కి పైగా నిత్యసేవలు, పూజలు, ఉత్సవాలతో స్వ

శ్రీవారి ఆలయ గగనతలంపై విమానాలు ఎగరకూడదని పురాణాలు చెబుతున్నాయి. శ్రీవారి ఆలయానికి రెండువేల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. వైఖానస ఆగమ నిబంధనలకు లోబడి నిత్యపూజలతో అలరారే స్వామివారి ఆలయ పవిత్రత చాలా ముఖ్యం. ఏటా 450కి పైగా నిత్యసేవలు, పూజలు, ఉత్సవాలతో స్వామివారు భక్తకోటికి దర్శనమిస్తూ సాక్షాత్కరిస్తుంటారు. సాక్షాత్తూ దేవతలు సైతం నిత్యం ఆకాశమార్గం నుంచి గర్భాలయమూర్తిని అపురూపంగా దర్శించి సేవిస్తున్నారని ఆగమం చెబుతోంది.
 
వైఖానస ఆగమ నిబంధనల ప్రకారం ఆలయ గగనతలంపై ఇతర లోహ పరికరాలు ఎగురకూడదని పండితులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. పార్లమెంటరీ భద్రతా కమిటీ హామీ బుట్టదాఖలు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద చర్యలు పెరిగిపోయాయి. అగ్రరాజ్యమైన అమెరికాలోని ట్విన్ టవర్స్ పైనే ఏకంగా విమానాలతో జరిగిన ఉగ్రదాడితో ప్రపంచమే తెల్లబోయింది. ఆ మేరకు దేశవ్యాప్తంగా భద్రతా విభాగం అప్రమత్తమైంది. రక్షణ చర్యలు రెట్టింపు చేసింది. ముష్కరుల టార్గెట్‌లో తిరుమల కూడా ఉందని 2009 సంవత్సరంలోనే అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం వెల్లడించారు. ఆలయ పవిత్రతతో పాటు భద్రతా పరంగా విమానాలు, విమానాల రాకపోకల్ని నిషేధించాలని సంకల్పించారు.
 
తర్వాత 2010సంవత్సరంలో కేంద్ర మాజీ మంత్రి అద్వానీ నేతృత్వంలోని పార్లమెంటరీ భద్రతా కమిటీ తిరుమల పర్యటనలో భాగంగా శ్రీవారి ఆలయంపై విమానాలు తిరగకుండా చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చింది. తరువాత తితిదే ధర్మకర్తలి మండలి కూడా విమానాలపై తీర్మానం చేసి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి చెందిన అశోక్‌గజపతిరాజు కేంద్ర పౌరవిమాన శాఖామంత్రి కూడా దీనిపై హామీ ఇచ్చారు. దీంతో తిరుమల కొండ మీద విమానాల నిషేధం ఖాయమని అందరూ భావించారు. ఈ తరుణంలో మంగళవారం రాజ్యభలో ఆశాఖ సహాయమంత్రి జయంత్‌ సిన్హా నిషేధం కుదరదు అని తేల్చేసి నిరాశపరిచారు.
 
తిరుమల కొండ కిందే అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న కారణంగా నిషేధించడానికి సాధ్యం కాదని, దీనివల్ల జాతీయ, అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన కేంద్రమంత్రి ఉండి కూడా నో ఫ్లై జోన్‌ తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తలపట్టుకున్న తితిదే, భద్రతా విభాగాలు కేంద్రం చేతులెత్తేయడంతో తితిదే, భద్రతా విభాగాలకు తలనొప్పిగా మారింది. తరచూ విమానాలు ఆలయ గగనతలంపై సమీపంలోనే చక్కర్లు కొడుతున్నాయి. తాజా నిర్ణయంతో తితిదే, భద్రతాధికారుల్లో ఆందోళన రెట్టిపైంది. గత యేడాది తిరుమలలో రెక్కీ జరిగినట్లు ఉగ్రవాద సానుభూతిపరులు వెల్లడించడం, తిరుమలలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని తరచూ కేంద్ర, నిఘా వర్గాలు పదేపదే హెచ్చరిస్తున్నాయి. 
 
ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం నిర్ణయం ఎంతవరకు సబబు అన్న విమర్సలు వినిపిస్తున్నాయి. ఇటు ఆలయ పవిత్రత, అటు భద్రతాలోటును ఏ విధంగా పూడ్చాలనే అంశంపై తితిదే, భద్రతా విభాగాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. సబబు ఆదంటూనే మౌనందాల్చిన తితిదే ఆగమ సలహాదారులు శ్రీవారి ఆలయంతో పాటు తితిదే అనుబంధ ఆలయాల్లో ఆగమ పరంగా పూజా కైంకర్యాలు, ఆలయ పవిత్రతకు సంబంధించిన అంశాల్లో సలహాలిచ్చేందుకు ప్రత్యేకంగా ఆగమ సలహాదారులున్నారు. వీరిలో ప్రధాన అర్చకులు ఏవీ రమణ దీక్షితులు, ఎకే.సుందరవరదన్‌, తిరుపతికి చెందిన విష్ణుభట్టాచార్యులు, తమిళనాడుకు చెందిన అప్పికట్ల దేశికాచార్యులు, ద్వారకా తిరుమలకు చెందిన రాంబాబు ఉన్నారు. తిరుమలలో ముడిపడిన కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పరిపాలనా పరమైన నిర్ణయమైనా ఆలయపరంగా సబబు కాదని స్పష్టం చేశారు. దీనిపై బహిరంగంగా మాట్లాడేందుకు ఎవరూ నిరాకరించకపోవడం గమనార్హం.