శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 23 నవంబరు 2016 (12:02 IST)

శ్రీ పోతూలూరి కాలజ్ఞానం: ఒకరి భార్యను మరొకరు వశపరుచుకుంటారు.. వేశ్యల వలన భయంకర రోగాలకు గురౌతారు.

వేశ్యల వలన ప్రజలు భయంకర రోగాలకు గురౌతారు. మనుషులు వావి వరసలు లేకుండా అతిగా ప్రవర్తిస్తారు. వారికి డబ్బే ప్రధానం అవుతుంది. ఒకరి భార్యను మరొకరు వశపరుచుకుంటారు. స్త్రీ పురుషులిరువురూ కామపీడితులౌతారు.

శ్రీ పోతులూరి వీర బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన ఆసక్తికర విషయాలు తెలుసుకోండి. 
 
1. వేశ్యల వలన ప్రజలు భయంకర రోగాలకు గురౌతారు. మనుషులు వావి వరసలు లేకుండా అతిగా ప్రవర్తిస్తారు. వారికి డబ్బే ప్రధానం అవుతుంది. ఒకరి భార్యను మరొకరు వశపరుచుకుంటారు. స్త్రీ పురుషులిరువురూ కామపీడితులౌతారు.

2. రాజులు తమ ధర్మాన్ని మరిచి విందు వినోదాలలో మునిగి ధర్మ భ్రష్టులౌతారు. 
 
3. పట్ట పగలు ఆకాశంలో నుంచి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు.
 
4. మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది. 
 
5. కోమటి కులంలో 25 గోత్రాలవారు మాత్రం మిగిలివుంటారు. ఉత్తరదేశంలో ఉత్తమభేరీ కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు. 
 
6. కోటిదూపాటిలో కొచ్చర్లకోటలో కోడి మాట్లాడుతుంది. 
 
7.శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం అవుతారు. 
 
8. పంటలు సరిగ్గా పండక పాడి పశువులు సరిగ్గా పాలివ్వక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తుంది. 
 
9. వావి వరసలు గౌరవ మర్యాదలు క్షీణించి, తండ్రి కొడుకును,  కొడుకు తండ్రిని దూషిస్తారు. 
 
10. జనుల కడుపులో మంటలు పుడతాయి. నోటిలో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ, రోగాల పాలై జనులు మరణిస్తారు. జంతువులూ అలాగే చస్తాయి. 
 
11. దుర్మార్గులు రాజులౌతారు. మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాలపాలై హీనంగా మరణిస్తారు. మతకలహాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటారు. 
 
12. నీళ్ళలో దీపాలను వెలిగిస్తారు. ఇతర దేశస్తులు భారతదేశాన్ని పాలిస్తారు.
 
13. నాలుగు వర్ణాల వారు గతి తప్పి నడుస్తారు. దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుని మరణిస్తారు. ప్రధానమైన 14 నగరాలను జలప్రవాహాలు ముంచెత్తుతాయి. 
 
14. కలియుగం 5000 సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవ్వరూ మిగలరు. ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్క గోవుకూడా మిగలదు. 
 
15. కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. ఆధాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్ళలో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు. జనులు అరచి అరచి చస్తారు. 
 
16. విషవాయువు కొట్టినప్పుడు శివునికంట నీరు కారుతుంది. గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వానకురుస్తుంది.
 
17. మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకుని మరణిస్తారు. పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతువౌతాయి. 
 
18. విచిత్రమైన ఈతచెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది. అలా ఏడెనిమిది సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది. అది మొదలు దేశంలో తీవ్రమైన కరువుకాటకాలు ఏర్పడతాయి. నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది. 
 
19. ఐదువేల ఏళ్ళ తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమై పోతుంది. రాజులు సర్వనాశనమైపోతారు. గ్రామాల్లో చోరులు పెరిగిపోతారు. పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి. 
 
20. శ్రీశైల పర్వతానికి ఓ మొసలి వస్తుంది. అది భ్రమరాంబ గుడిలో దూరి 8 రోజులుండి మేకలా కూసి మాయమౌతుంది. విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లు నిలబడిన వారు నిలబడినట్లు మరణిస్తారు. రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయి.