సాయి బాబా సూక్తులు.....

Written By సిహెచ్
Updated: శనివారం, 15 జూన్ 2019 (23:13 IST)
1. ఎవరైనా తన సర్వస్వాన్ని నా సన్నిధానంలో సమర్పిస్తే , నిరంతరం నన్ను స్మరిస్తుంటే, తన అహంకారాన్ని, అవిద్యను, అజ్ఞానాన్ని నశింపచేసుకుంటారు. అతడు ప్రాపంచికమైన అన్ని దుర్గుణాలకు దూరమై, పాపకృత్యముల నుండి విముక్తి పొందుతాడు. అతడికి నిరంతర ఆనందం లభిస్తుంది.
 
2. ఎవరైతే నన్నే ఆశ్రయిస్తూ, తన మనస్సును సమస్త ప్రాపంచిక విషయముల నుండి ప్రాపంచిక సుఖముల నుండి మరల్చి నన్నే స్మరిస్తూ ఉంటారో వారు పరమానందాన్ని పొందుతారు. 
 
3. ఎవరైనా వారి భారాన్ని పరిపూర్ణ విశ్వాసంతో నాపై ఉంచితే దానిని నేనే భరిస్తూ వారిని కాపాడతాను. 
 
4. నేను సర్వాంతర్యామిని. భక్తుడు పతనావస్ధలో ఉంటే, అతనిని కాపాడుటే నా విధి. ప్రతి ప్రాణిలో నన్ను దర్శిస్తూ, కరుణార్ద్ర హృదయంతో ఆదరించి పోషిస్తారో, వారు నన్నునిజంగా పోషించినవారౌతారు.
 
5. నన్ను స్మరిస్తున్నవారికి, నా శరణాగతి కోరిన వారికి నేనెప్పుడు ఋణపడి ఉంటాను. నేను ఆత్మ సందర్శనాన్ని, కైవల్యాన్ని ప్రసాదించి నా ఋణము తీర్చుకుంటాను. అత్యంత ప్రేమతో నన్ను స్మరించిన వారికి వారి సమస్త కోరికలను తీరుస్తాను.
 
6. నా కధలు అత్యంత శ్రద్దతో విని మననం చేయువారికి సమస్త రోగాల నుండి విముక్తి కలుగుతుంది. నిత్యం స్మరిస్తూ, నన్నే ధ్యానిస్తూ నా నామోచ్చారణ చేస్తుండేవారిని, నన్ను స్మరిస్తున్న వారికి, నా శరణాగతి కోరిన వారికి నేనెప్పుడు ఋణపడి ఉంటాను.

అన్నీ చూడండి

మహిళా పారిశ్రామికవేత్తలతో ప్రతి మూడు నెలలకోసారి సమావేశం నిర్వహిస్తా: సీఎం రేవంత్ రెడ్డి

Vizag: 1.7 కిలోల బరువున్న శిశువుకు అరుదైన మెదడుకు శస్త్ర చికిత్స

కార్గిల్ విజయ్ దివస్ 2026: జావా, యెజ్డీలపై రైడర్లతో శౌర్య విజయ్ యాత్రను ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్

అలా నిరూపిస్తే కచ్చితంగా రాజకీయాలకు స్వస్తి పలుకుతాను.. కేటీఆర్

చంద్రాయణగుట్టలో లైసెన్స్ లేని మందులు

అన్నీ చూడండి

అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతను బలోపేతం.. టీటీడీ ఏర్పాట్లు

18-07-2026 శనివారం ఫలితాలు - శ్రీమతి వైఖరిలో మార్పు...

17-07-2026 శుక్రవారం ఫలితాలు - లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి..

Anivara Asthanam: తిరుమలలో ఆణివార దేవస్థానం..

శ్రీనివాసమంగాపురంలో జూలై 17 నుండి వార్షిక సాక్షాత్కార వైభవోత్సవాలు

తర్వాతి కథనం
Show comments