శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By tj
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2017 (14:07 IST)

శ్రీకాళహస్తిలో మహా వివాదాలు..!

శ్రీకాళహస్తీశ్వరాలాయంలో 16 యేళ్ళ తర్వాత మహాకుంభాభిషేకం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి ఏడాది క్రితం నుంచి హడావుడి చేస్తున్నారు. అయినా ఏర్పాట్లలో తడబాటు తప్పలేదు.

శ్రీకాళహస్తీశ్వరాలాయంలో 16 యేళ్ళ తర్వాత మహాకుంభాభిషేకం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి ఏడాది క్రితం నుంచి హడావుడి చేస్తున్నారు. అయినా ఏర్పాట్లలో తడబాటు తప్పలేదు. త యేడాది శివరాత్రి ఉత్సవాల్లో లాగే కుంభాభిషేక ఆహ్వాన పత్రికల విషయంలో వివాదాలు చోటుచేసుకున్నాయి. ముద్రణ నుంచి పంపిణీ దాకా అనేక విమర్శలు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
ఆలయ కుంభాభిషేక ఉత్సవం కోసం శ్రీకాళహస్తి పట్టణ వాసులు నాలుగేళ్ళుగా నిరీక్షిస్తున్నారు. అనేక ఒత్తిళ్ళ ఫలితంగా నాలుగేళ్ళు ఆలస్యంగానైనా ఈ ఉత్సవాన్ని నిర్వహించడానికి ఆలయ అధికారులు సిద్ధమయ్యారు. అయితే అందరినీ ఇందులో భాగస్వామ్యులను చేయడంలో విఫలమయ్యారు. ఆహ్వాన పత్రికలను సరిగ్గా పంపిణీ చేయలేకపోయారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కుంభాభిషేకం ఉత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆయనకు అసలు ఆహ్వానపత్రం ఇచ్చారా లేదా అనేది సందేహంగా ఉంది. 
 
గత యేడాది శివరాత్రి ఉత్సవాలపుడు ఈ ఛైర్మన్, మంత్రి అందరూ కలిసి వెళ్ళి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. కుంభాభిషేక ఉత్సవాల సందర్భంగా అలాంటి ప్రయత్నం ఏదీ జరిగినట్లు కనిపించలేదు. సాధారణంగా శివరాత్రి ఉత్సవాలపుడు ఈఓ, ఛైర్మన్, మంత్రి అందరూ కలిసి వెళ్ళి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. కుంభాభిషేక ఉత్సవాల సంతృదర్భంగా అలాంటి ప్రయత్నం ఏదీ జరిగినట్లు కనిపించలేదు. సాధారణంగా శివరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికలను చాలా మంది ప్రముఖులకు అందజేస్తారు. 
 
ఈ ఉత్సవాల విషయంలో మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. త్వరలోనే శివరాత్రి ఉత్సవాలు వస్తున్నందున అప్పుడు యేటా ఆహ్వాన పత్రికలు అందజేస్తాం కదా అనుకున్నారేమో ఆ విషయంలో నిర్లక్ష్యం చేశారు. దీంతో పట్టణానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడే ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుంభాభిషేకం ఉత్సవాలకు స్థానికంగా ఉన్న ప్రముఖులకే ఆహ్వాన పత్రికలు ఇవ్వరా అంతగా మీ ఇష్టమా అని గట్టిగా మాట్లాడినట్లు సమాచారం.
 
తిరుపతి ఎంపి వరప్రసాద్ ఫోటో, పేరు ఆహ్వాన పత్రికల్లో ముద్రించకపోవడంపై ఆ పార్టీ నాయకులు, ఆలయానికి వచ్చి ఈఓను కలిసి తమ నిరసనను తెలియజేశారు. ఆ మాటకొస్తే చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలకు ఎమ్మెల్సీలుగా ఉన్న విఠపు బాలసుబ్రమణ్యం, యండపల్లి శ్రీనివాసులరెడ్డి ఫోటోలు పేర్లు కూడా వేయలేదు. ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన కిందకే వస్తుంది. అధికారులు, పాలకమండలి మధ్య సమన్వయం లోపించడం వల్ల తలెత్తుతున్న లోపాలే ఇవన్నీ. అసంతృప్తిని పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. ఆఖరికి మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి కూడా చివరి రోజు మాత్రమే కార్యక్రమంలో పాల్గొన్నారు. తన పలుకుబడితో వివిధ రంగాల ప్రముఖులను యాగానికి ఆహ్వానించి తన పని పూర్తి చేసుకుని తనదారిన వెళ్ళింది
 
పట్టంణంలో చాలామంది ప్రముఖులు ఉన్నారు. వాళ్ళనూ పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో స్థానికుల్లో మా ఊర్లో నవయుగ పెత్తనం ఏమిటి? అనే భావన కలిగింది. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాజగోపురాన్ని పునర్నిర్మించడం నవయుగ సంస్థ యాగం విషయంలో కాస్త జాగ్రత్తలుగా తీసుకుని ఉంటే స్థానికుల మనసులో ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోయేవారు. చిన్నపాటి లోపాల వల్ల స్థానికుల వ్యతిరేకతను చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.