సోమవారం, 3 ఫిబ్రవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: శనివారం, 23 జులై 2016 (18:07 IST)

ఆదివారం ఆచరించాల్సిన వ్రతం...

చర్మ, నేత్ర వ్యాధుల నిర్మూలనకు, సంతాన క్షేమానికి, వైవాహిక జీవిత అనుకూలతకు ఆదివారంనాడు సూర్యారాధన చేయాలి. అందుకోసం ఆదివారం నాడు ఉపవాసం వుండి, సూర్యారాధన లేక సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. అయితే దీనిని ఒక వ్రతంలాగా ఆచరించాలి

చర్మ, నేత్ర వ్యాధుల నిర్మూలనకు, సంతాన క్షేమానికి, వైవాహిక జీవిత అనుకూలతకు ఆదివారంనాడు సూర్యారాధన చేయాలి. అందుకోసం ఆదివారం నాడు ఉపవాసం వుండి, సూర్యారాధన లేక సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. అయితే దీనిని ఒక వ్రతంలాగా ఆచరించాలి. ఈ వ్రతాన్ని శుక్లపక్ష ఆదివారం నాడు ప్రారంభించి, ఆ సంవత్సరంలో వచ్చే అన్ని ఆదివారాలు ఆచరించాలి. అలా ఆచరించలేని వారు కనీసం 12 వారాలైనా చేయాలి.
 
వ్రత విధానం: ఆదివారం నాడు ఉదయమే మేల్కొని తలారా స్నానం చేసి సూర్యునికి ఎదురుగా నిల్చుని సూర్యమంత్రాన్ని లేదా ఆదిత్య హృదయాన్ని మూడుసార్లు చదవాలి. ఆపైన గంగా జలాన్ని, లేదా శుద్దోదకాన్ని, ఎర్ర చందనాన్ని, దర్భలను సూర్యనారాయుణిడికి సమర్పించుకోవాలి. ప్రతి ఆదివారమూ ఉపవాసం వుంటే మంచిది. లేని పక్షంలో ఉద్యాపన చేసే రోజున మాత్రం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. పగలు పూజానంతరం ఎవరైనా దంపతులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి.