Daily Horoscope
✕

ఒకడిని బలవంతుడిగా మరొకడిని అధముడిగా చేసేది అదే... స్వామి వివేకనంద

Written By సిహెచ్
Updated: గురువారం, 20 డిశెంబరు 2018 (20:15 IST)
1. గొప్ప విశ్వాసాల నుండే మహత్తర కార్యాలు సాధించబడతాయి.
 
2. ఆత్మవిశ్వాసం  కలిగి ఉండండి. మీరందరు ఒకప్పటి వేదఋషులు. ఇప్పుడు మీరు వేరు రూపాలలో వచ్చారు. అంతే తేడా... మీ అందరిలో అనంత శక్తి ఉంది. పగటివేళ కాంతిలా ఈ విషయాన్ని స్పష్టంగా చూస్తున్నాను. ఈ శక్తిని జాగృతం చేయండి. మేల్కోండి...
 
3. అభివృద్ధి చెందడానికి మెుదట మనపై తరువాత భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండాలి. తనపై విశ్వాసం లేనివానికి భగవంతునిపై విశ్వాసం కలగడం కల్ల.
 
4. నీలో అనంతశక్తి ఉందని విశ్వాసం కలిగి ఉండు. జాగరూకుడవై ఆ శక్తిని వ్యక్తపరచు. నేను ఏదైనా సాధించగలను అని సంకల్పించు. పాము విషం కూడా గట్టిగా తిరస్కరిస్తే మీ పట్ల నిర్వీర్యమైపోతుంది. జాగ్రత్త.... చేయలేను అని అనవద్దు. ప్రతికూల భావనలు రాకూడదు.
 
5. మనకు కావలసింది శ్రద్ధ... మనిషికి మనిషికి మధ్య తేడా శ్రద్ధలో ఉన్న తారతమ్యమే గాని వేరేమీ కాదు. ఒక మనిషిని గొప్పవాడుగాను, ఇంకొకరిని బలహీనుడిగాను అధముడుగాను చేసేది శ్రద్ధే... కాబట్టి ఈ శ్రద్ధ మీలో ఉండాలి.
 
6. అపార విశ్వాసం, అనంత శక్తి ఇవే విజయ సాధనకు మార్గాలు.
 
7. ధృడసంకల్పం, పవిత్ర ఆశయం తప్పక సత్ఫలితాలను ఇస్తాయి. వీటిని ఆయుధాలుగా గ్రహించినవారు, వారు కొద్దిమందే అయినా, అన్ని విఘ్నాలను ఎదుర్కొని నిలువగలుగుతారు.

అన్నీ చూడండి

పులివెందుల, మైదుకూరు జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ

రాహుల్‌ ఎదిగినా... కాంగ్రెస్‌ బలం తగ్గింది: వరుస ఎన్నికల ఓటములపై అమిత్‌షా విమర్శలు

రూ.30వేల లంచం తీసుకున్నాడు.. సోదాల్లో దొరికిపోయాడు.. 11 స్థలాలు, బంగారం, రెండు భవనాలు...?

ఎంత పని చేశాడు.. భార్యను చంపి.. తండ్రి సాయంతో భద్రాచలం వద్ద గోదావరిలో పడేశాడు.. చివరికి?

ఎదురు తిరిగితే బుల్డోజర్లు పంపుతారా? దమ్ముంటే నాపైకి పంపండి : మమతా బెనర్జీ

అన్నీ చూడండి

07-11-2026 శనివారం నాటి రాశి ఫలాలు - అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటే..?

Diwali 2026: దీపావళి రోజున బుధాదిత్య యోగం, నీచభంగ రాజయోగం.. ఈ రాశుల వారికి అంతా శుభమే

Diwali 2026: దీపావళి రోజున చేయకూడని ఆ నాలుగు తప్పులేంటి?

దీపావళి 2026.. ఏ రోజున జరుపుకోవాలి.. దీపాలను వెలిగించడం ఎందుకంటే?

ధన త్రయోదశి నాడు ఈ 5 పనులు తప్పక చేయండి

తర్వాతి కథనం
Show comments