మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 24 నవంబరు 2018 (20:51 IST)

భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడూ లెక్కపెట్టేవాడు...

1. నిలువెల్లా స్వార్థం నిండిన వ్యక్తే ఈ లోకంలో ఎక్కువ దుఃఖాన్ని అనుభవించేది. స్వార్థం లేశమైనా లేని వ్యక్తే పరమానందాన్ని పొందేది.
 
2. అసూయనూ, తలబిరుసును విడనాడండి. పర హితార్థమై సమిష్టిగా కృషి చేయడం అలవరుచుకోండి. మన దేశపు తక్షణ అవసరం ఇది.
 
3. భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడూ లెక్కపెట్టేవాడు దేనిని సాధించలేడు. సత్యమని మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు.
 
4. ఏదో ఒక ఆదర్శాన్ని కలిగి ఉన్న వ్యక్తి వెయ్యి పొరపాట్లు చేస్తే, ఏ ఆదర్శము లేనివాడు యాబైవేల పొరపాట్లు చేస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి ఒక ఆదర్శం కలిగి ఉండడం మంచిది.
 
5. మన చుట్టూ ఉండే విషయాలు ఎన్నటికీ మెరుగుపడవు. అవి ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. వాటిలో మనం తెచ్చిన మార్పులు ద్వారా మనమే పరిణితిని పొందుతాము.
 
- స్వామి వివేకానంద