శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : ఆదివారం, 18 డిశెంబరు 2016 (16:25 IST)

తితిదే పాలకమండలిలో ఎవరుండాలి..... భక్తులు అర్హులు కాదా?

కాంట్రాక్టర్ జే.శేఖర్ రెడ్డి ఉదంతంతో తితిదే పాలకమండలిపై భక్తుల్లో తీవ్రమైన చర్చ ఆరంభమైంది. తితిదే పాలక మండలి సభ్యులందరూ తమ ఆస్తులను ప్రకటించాలని కొందరు డిమాండ్‌ చేస్తే కొందరు అసలు వ్యాపారవేత్తలను, రాజ

కాంట్రాక్టర్ జే.శేఖర్ రెడ్డి ఉదంతంతో తితిదే పాలకమండలిపై భక్తుల్లో తీవ్రమైన చర్చ ఆరంభమైంది. తితిదే పాలక మండలి సభ్యులందరూ తమ ఆస్తులను ప్రకటించాలని కొందరు డిమాండ్‌ చేస్తే కొందరు అసలు వ్యాపారవేత్తలను, రాజకీయ నాయకులను, పారిశ్రామికవేత్తలను తితిదే ధర్మకర్తల మండలిలో సభ్యులుగా నియమించకూడదని మరికొందరు అంటున్నారు. మఠాధిపతులు, పీఠాధిపతులు మాత్రమే ధర్మకర్తలుగా ఉండాలని సూచిస్తున్నారు. 
 
ఈవిధంగా డిమాండ్‌ చేయడానికి ఓ కారణం ఉంది. పలువురు సభ్యులు తితిదే వంటి ధార్మిక సంస్థను వీధుల పాలు చేస్తున్నారన్న ఆవేదన ఉంది. ఏ వ్యాపారులో, పారిశ్రామికవేత్తలో ఆర్థిక ఆరోపణలు ఎదుర్కొంటే జనం పట్టించుకోరుగానీ, ధర్మకర్తల మండలిలో ఉన్న వారు పదుగురికీ ఆదర్శనంగా మెలగాల్సి వారు ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్నప్పుడు భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. సంస్థ ప్రతిష్ట దెబ్బతింటుంది. అందుకే వారు అలా మాట్లాడుతున్నారు.
 
అయితే మఠాధిపతులు, పీఠాధిపతులను నియమించినంత మాత్రాన తితిదే పాలనా వ్యవహారాలు సవ్యంగా సాగుతాయని చెప్పలేం. తిరుమలలోని మఠాల నడవడికను చూస్తే చాలు.. ఇక వేరే ఉదాహరణలు అవసరం లేదు. ఆధ్మాత్మిక కేంద్రాలుగా ఉండాల్సిన మఠాలను వ్యాపార కేంద్రాలుగా మార్చేశారు. అయినా ఆ మాటకొస్తే శ్రీవారి ఆలయం సహా తితిదే అన్ని ఆలయాల్లో పూజాది కార్యక్రమాల్లో ధర్మకర్త మండలి జోక్యం పెద్దగా లేదు. ఇప్పటికీ జియ్యంగార్ల పర్యవేక్షణలోనే సాగుతున్నాయి.
 
ధర్మకర్తల మండలిని నియమంచేటప్పుడు కాస్త సేవాదృక్పథం, సామాజిక దృక్పథం ఉన్నవాళ్ళను ఎంపిక చేసుకుంటే చాలు. అయితే ఛైర్మన్‌, పాలకమండలి సభ్యుల పదవులను రాజకీయ పదవులకు ప్రత్యామ్నాయంగానూ, ఇతర నామినేటెడ్‌ పదవుల్లాగానూ భావిస్తూ నియామకాలు చేపట్టడం వల్లే సమస్య తలెత్తుతోంది. పాలకమండలి సభ్యులుగా ఉండాలని కోరుకుంటున్న వారంతా దాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అందుకే బడాబడా పారిశ్రామికవేత్తలు కూడా ఈ పదవి కోసం పోటీపడుతున్నారు. భవిష్యత్తులో రాబోయే ధర్మకర్తల మండళ్ళయినా ఇలాంటి జాగ్రత్తలతో ఏర్పాటు చేస్తారని ఆశిద్దాం.