1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2016 (11:14 IST)

తిరుమలలో అనంతాళ్వాన్‌ ఎవరు..! శ్రీవారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి!

తిరుమలలో పూర్వం శ్రీ రంగక్షేత్రంలో భగవద్రామానుజులు (క్రీ.శ.1017-1137)లో శ్రీ వైష్ణవ విశిష్టాద్వైత సిద్థాంతాన్ని శిష్యులకు ఉపదేశిస్తూ ఒకనాడు శరణాగతి, ప్రవత్తి మార్గాలతో కూడిన సేవా కైంకర్యాలను గురించి వ

తిరుమలలో పూర్వం శ్రీ రంగక్షేత్రంలో భగవద్రామానుజులు (క్రీ.శ.1017-1137)లో శ్రీ వైష్ణవ విశిష్టాద్వైత సిద్థాంతాన్ని శిష్యులకు ఉపదేశిస్తూ ఒకనాడు శరణాగతి, ప్రవత్తి మార్గాలతో కూడిన సేవా కైంకర్యాలను గురించి విశిష్టంగా తెలియజేశారు. ఇంకా వారు శ్రీ రంగక్షేత్రం భోగమండపమనీ, కంచి త్యాగ మండపమనీ, వేంకటాచలక్షేత్రం పుష్పమండపమనీ ఇలా ప్రసిద్ధి పొందాయనీ, పుష్పమండపమైన తిరుమల క్షేత్రంలో అత్యంత పుష్పప్రియుడైన శ్రీ వేంకటేవ్వరస్వామివారికి పుష్పమాలా కైంకర్యం చెయ్యడం భగవత్పీతి కరమని వివరిస్తూ శాశ్వతంగా తిరుమలలో ఉంటూ అక్కడి చలికి, వర్షానికి, కీటకాలకు ఓర్చుకొంటూ తోటలను పెంచుతూ వేంకటభగవానునికి పుష్పమాలా సమర్పణం చెయ్యగలవారెవరైనా ఉన్నారా? అంటూ తన శిష్యులను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు శిష్యులందరూ ఒకరి మొకాలొకరు చూసుకుంటూ నసుగుతున్న తరుణంలో ఆనందాళ్వాన్‌ (అనంతాచార్యులు) అనే శిష్యుడు లేచి చేతలు జోడించి గురువర్యా? నేను అందుకు సిద్థంగా ఉన్నాను అన్నాడట.
 
వెంటనే రామానుజులు భళా.. నీవే నిజమైన మగవాడివి అని పొగుడుతూ ఆశీర్వించి తిరుమలకు వెళ్ళడం అనుమతి ఇచ్చాడట. ఆనాటి నుంచి అనంతాచార్యులు ఆనందాణ్‌ పిళ్లై అనీ, అనంతపురుషుడని ప్రసిద్ధి పొందాడు. 
 
గురువే తన పాలిట దైవంగా తలంచిన ఆనందాళ్వాన్‌, రామానుజులవారి ఆజ్క్షను శిరసావహించి భార్యతో కూడా తిరుమల చేరుకున్నాడు. అత్యంత నిష్టతో వివిధ రకాల పూలను సేకరిస్తూ శ్రీ వేంకటేశ్వర స్వామివారికి మాలా కైంకర్యం చేయటానికి బద్ధకంకణుడయ్యాడు. అప్పటికే వేంకటాచలం క్షేత్రంలో ఉంటూ శ్రీనివాసభగవానునికి తీర్థం కైంకర్యాల్ని చేస్తూ ఉండిన వృద్ధులైన తిరుమల నంబి చేత తిరుమల మీద పుష్పవనాలను గురించి శ్రీ వేంకటేశుని పుష్పప్రియత్వాన్ని గురించి అనంతాచార్యులు విన్నాడు. 
 
అంతేకాకుండా భగవద్రామానుజుల పరమగురువూ, తిరుమల నంబి గురువు అయిన యమనాచార్యులు కూడా కొంతకాలం పాటు శ్రీనివాసుని దివ్య సన్నిధిలో ఉంటూ పుష్పమాలా కైంకర్యాన్ని నిర్వహించి ధన్యులు అయ్యారని కూడా అనంతాళ్వాను విని పరమానందపడ్డాడట. తన గురువులైన రామానుజాచార్యుల వారి ఆదేశం తర్వాత తాను చేస్తూ ఉన్న ఈ పుష్ప కైంకర్యాన్ని పరమల గురువులైన యమునాచార్యుల వారి పేరుతోనే నిర్వహింపబడి సమకట్టి తిరుమల శ్రీవారి ఆలయం ఆవరణలోనే యమునోత్తర అనే పుష్పమండపాన్ని ఏర్పాటు చేశాడు. 
 
ఆనాటి నుంచి ఆ యమునోత్తర పుష్పమండపంలోనే వివిధ కరాలైన పూలదండల్ని గురించి అనంతాళ్వాన్‌ ఉదయం, సాయంత్రం, ఇలా ప్రతిరోజు రెండుపూటలా జరిగే శ్రీ స్వామివారి తోమాలసేవకుగాను తాను శ్రద్థగా తయారు చేసిన పూలమాలల్ని సమర్పించేవాడట. స్వామివారి కోసం ఏకంగా ఒక ఉద్యానవనాన్నే ఏర్పాటు చేయాలనుకున్నాడు. కటిక బీదరికంలో ఉన్న అనంతాళ్వాన్‌ తన భార్యతో కలిసి తన వద్ద ఉన్న కొద్ది డబ్బులతో ఉద్యానవనాన్ని కట్టడం ప్రారంభించాడు.
 
కనీసం తినడానికి తిండికూడా లేకుండా తన కోసం ఉద్యానవనాన్ని నిర్మించి ఆ పుష్పాలను తనను పూజించడానికేనని తెలిసిన శ్రీనివాసుడు అనంతాళ్వాన్‌కు సహాయం చెయ్యడానికి 16 యేళ్ళ యువకుడి రూపంలో వస్తాడు. అయితే తన వద్ద ఏమీ లేదని, కనీసం తిండి కూడా పెట్టలేనని, వేరే ఏదన్నా ఉంటే చూసుకోమని అనంతాళ్వాన్‌ చెప్పి పంపేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అనంతాళ్వాన్‌ పట్టుదలతో తన కోసం కష్టపడుతుండాన్ని చూసిన స్వామివారు ఎంతో సంతోషిస్తారట. ఎలాగోలా ఉద్యానవనాన్ని పూర్తి చేసిన అనంతాళ్వాన్‌ ఆ పువ్వులతో తిరుమల స్వామివారి మూలవిరాట్‌కు పూజ చేసేవారట. ఇలా చేస్తుండగా ఒకసారి అనంతాళ్వాన్‌కు స్వామివారు దర్శనభాగ్యం కల్పిస్తారట. భక్తిగావుంటే ఎవరికైనా స్వామివారు కనిపిస్తారని పురాణాలు చెబుతున్నాయి.