1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రాంతాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2016 (12:01 IST)

కళ్ళు తెరిచి చూస్తూ భక్తులను అనుగ్రహించే వరదరాజ స్వామి గురించి మీకు తెలుసా?

మనసంతా బాధ.. ఆలయానికి వెళ్ళాక.. ఇంత కష్టాల్లో ఉన్న తమను కళ్లు తెరిచి చూడలేవా తండ్రీ అంటూ స్వామివారిని మొక్కుకునే వుంటాం. అయితే మన కష్టాలను, ఈతిబాధలను తొలగిస్తానని.. కళ్లు తెరిచి చూస్తూ.. భక్తులకు అభయమ

మనసంతా బాధ.. ఆలయానికి వెళ్ళాక.. ఇంత కష్టాల్లో ఉన్న తమను కళ్లు తెరిచి చూడలేవా తండ్రీ అంటూ స్వామివారిని మొక్కుకునే వుంటాం. అయితే మన కష్టాలను, ఈతిబాధలను తొలగిస్తానని.. కళ్లు తెరిచి చూస్తూ.. భక్తులకు అభయమిచ్చే దేవుడి గురించి మీకు తెలుసా.. అయితే ఈ స్టోరీ చదవండి. తమిళనాడు రాజధాని నగరం చెన్నై కోయంబేడుకు సమీపంలోని నెర్కుండ్రం వరదరాజ పెరుమాళ్ స్వామి ఆలయంలో భక్తులను కళ్ళు తెరిచి భక్తులను అనుగ్రహించే స్వామివారి దర్శించుకోవచ్చు. 
 
హారతి ఇస్తున్న తరుణంలో స్వామివారి కళ్లు తెరుచుకుని వున్నట్లు కనిపిస్తుంది. హారతి స్వామివారికి దగ్గర్లో చూపెట్టినట్లైతే.. ఆయన కళ్ళు మనల్ని చూస్తున్నట్లు ఉంటుంది. ఈ దర్శనాన్ని వీక్షించే వారికి పెరుమాళ్ల స్వామి అనుగ్రహం లభిస్తుంది. అలాంటి మహిమాన్విత వరద రాజ స్వామి కళ్లు తెరుచుకుని వుండే దృశ్యాన్ని చూడాలనుకుంటున్నారా? వీడియో చూడండి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్పూర కాంతినిచ్చే సమయంలో స్వామివారి కళ్లు తెరుచుకుని ఉండేలా.. గర్భ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.