బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 7 మార్చి 2017 (12:59 IST)

భద్రాద్రిలో అపచారం జరిగింది.. గర్భగుడిలోకి ప్రవేశించారట.. కొబ్బరికాయ కూడా కొట్టారట..

పుణ్యక్షేత్రం భద్రాద్రి సీతారాముల వారి ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఓ జంట నిబంధనలకు విరుద్ధంగా గర్భగుడిలోకి ప్రవేశించింది. కానీ ఈ విషయాన్ని అధికారులు, పూజారులు దాచేశా

పుణ్యక్షేత్రం భద్రాద్రి సీతారాముల వారి ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఓ జంట నిబంధనలకు విరుద్ధంగా గర్భగుడిలోకి ప్రవేశించింది. కానీ ఈ విషయాన్ని అధికారులు, పూజారులు దాచేశారు. కానీ మీడియా కనిపెట్టేసింది.

సోమవారం సాయంత్రం ఓ జంట పూజల నిమిత్తం టిక్కెట్టు కొనుక్కుని ఆలయంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో అక్కడ అర్చకులెవరూ లేకపోవడంతో బంగారు వాకిలి దాటి గర్భగుడిలోకి ప్రవేశించారు. అయినా ఎవరూ గమనించలేదు. సుమారు 5 నిమిషాలపాటు అక్కడే ఉన్న ఆ జంట.. కొబ్బరికాయ కూడా కొట్టినట్లు తెలిసింది.
 
ఆలస్యంగా మేలుకొన్న ఆలయ సిబ్బంది.. గర్భగుడిలోకి వెళ్లిన ఆ జంటను ప్రధాన ఆలయం నుంచి బయటకు పంపారు. వెంటనే ఆలయంలో సంప్రోక్షణ చర్యలు చేపట్టారు. కానీ మూల విరాట్ తాకారా? లేదా అనేది తెలియనప్పటికీ సంప్రదాయాలను పాటించే ఈ ఆలయంలో పెద్ద అపచారంగా భావిస్తున్నారు.

కాగా, మరికొందరు భక్తులు కూడా ఆలయంలోకి ప్రవేశించి సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు దర్శనాలు చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.