శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : సోమవారం, 23 మే 2016 (15:50 IST)

తితిదే వెబ్‌సైట్‌లో 15 వేల అన్నమయ్య కీర్తనలు

పదకవితా పితామహుడు అన్నమయ్య రాసిన కీర్తనలు తిరుమల తిరుపతి దేవస్థానం తమ వెబ్‌సైట్‌లో ఉంచారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ తిరుమల.ఓఆర్‌జిలో 15 వేల అన్నమయ్య సంకీర్తనల సాహిత్యం వాటి అర్థాలు, మహా విషయ సూచిక ఇలా ఒక పెద్ద శ్రీవారి కీర్తనల సాహిత్య బాండాగారం అందుబాటులోకి వచ్చింది. డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.తిరుమల.ఓఆర్‌జి, అన్నమాచార్య వెబ్‌ పేజ్‌.ఎఎస్పీఎక్స్ అనే వెబ్‌పేజీలో సంకీర్తనల విభాగంలో ఈ సాహిత్యాన్ని చూడొచ్చు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు, అన్నమయ్య సంకీర్తనాభిలాషులను దగ్గర చేసే సంకల్పంతో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కల్లూరి శ్రీనివాస్‌, గుంటూరు జిల్లాకు చెందిన పెద్ది సాంబశివ రావులు మరో 70మందితో కలిసి విశ్వవ్యాప్తంగా అన్నమయ్య భక్త దాస బృందంగా ఏర్పడ్డారు. 
 
ఈ బృందం ఏడేళ్ళ పాటు శ్రమించి 29 పుస్తకాల్లోని 15 వేల అన్నమయ్య సంకీర్తనల సాహిత్యాన్ని యూనికోడ్‌ ద్వారా ఇంటర్నెట్‌లో పెట్టడానికి తెలుగు అక్షర రూపం ఇచ్చారు. సొంత ఖర్చుతో రూపొందించిన ఈ అక్షర యజ్ఞ సమాచారాన్ని తితిదేకి ఉచితంగా అందించారు. 
 
తితిదే ఈఓ సాంబశివరావు సహకారంతోనే ఇంటర్నెట్‌లో కీర్తనలను పెట్టగలిగామన్నారు అన్నమయ్య భక్తదాన బృందంకు చెందిన కల్లూరి శ్రీనివాస్‌. భవిష్యత్తులో అన్నమయ్య సంకీర్తనలు పలికే విధానం, ఉచ్ఛారణ పండితులతో పలికించి ఆడియో రూపంలో దేవస్థానం వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నామని చెప్పారు.