Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

తిరుమల కొండపై కనిపించని భౌతిక దూరం .. శానిటైజేషన్ అస్సలే లేదు..

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 13 డిశెంబరు 2020 (18:31 IST)
కరోనా వైరస్ మహమ్మారి భయం ఇంకా వీడిలేదు. పైగా, ఈ వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. ఇప్పటికీ దేశంలో 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం తితిదే అనేక ఆంక్షలు విధించింది. ముఖ్యంగా ముఖానికి మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. 
 
అయితే, తిరుమల గిరుల్లో కోవిడ్ నిబంధనలను భక్తులు అపహాస్యం చేస్తున్నారు. భక్తులు కనీస బాధ్యతను విస్మరించి ఇష్టారీతిన తిరిగేస్తున్నారు. ఒక్క ఆలయం లోపల తప్ప.. కొండపై మరేచోటా మాస్కులు ధరించడం లేదు. భౌతిక దూరం లేదు.. శానిటైజేషన్ అస్సలే లేదు. 
 
తలనీలాలు ఇచ్చే కల్యాణ కట్టలోనూ ఇదే పరిస్థితి. భక్తులలో ఇంత నిర్లక్ష్యం కనపడుతుంటే.. అటు తిరుమల అధికారుల నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడం దారుణం. భక్తులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ.. కోవిడ్ నిబంధనలు పాటించేలా చేయడం అధికారుల బాధ్యత అని, కానీ అది కూడా ఇక్కడ లేకపోవడం విచారకరమని కొంతమంది వాపోతున్నారు. 
 
దూరాభారాలను లెక్క చేయకుండా భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు వస్తుంటారు. ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని తరిస్తుంటారు. అలాంటి ఏడుకొండలపై కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా అధికారులు చర్యలు చేపట్టాలని.. అసలే సెకండ్ వేవ్ మొదలైందన్న వార్తల నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరి అని వైద్యులు అంటున్నారు. 

అన్నీ చూడండి

130 ఏళ్ల వాతావరణ చరిత్రలో పూరీలో గరిష్టంగా 36.6 డిగ్రీల ఉష్ణోగ్రత

ఎర్రవల్లి గ్రామంలో అదృశ్యమైన 45 ఎకరాల భూమిని గుర్తించాలి.. రేవంతన్న ఆదేశాలు

హోర్ముజ్ జలసంధిలో నౌకపై దాడి: 11 మంది భారతీయులకు గాయాలు

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని గొంతుకు డీప్‌ఫేక్ ముప్పు.. అలా దరఖాస్తు..

Woman: భర్తను హత్య చేసిన మహిళకు, ప్రియుడికి యావజ్జీవ కారాగార శిక్ష

అన్నీ చూడండి

06-10-2026 - మంగళవారం నాటి రాశి ఫలితాలు.. ఓర్పుతో వ్యవహరిస్తే...?

05-10-2026 సోమవారం ఫలితాలు - ఆశించిన పదవి దక్కకపోవచ్చు...

04-10-2026 - ఆదివారం రోజువారీ రాశి ఫలాలు - ఆర్థిక వ్యవహారాల్లో స్పష్టత పెరుగుతుంది

అక్టోబర్ 10 నుండి 18 వరకు వైభవంగా బతుకమ్మ పండుగ

04-10-2026 నుండి 10-10-2026 వరకు వారఫలాలు - శుభలేఖ అందుకుంటారు

తర్వాతి కథనం
Show comments