1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Devotee Found Pin In Tirumala Laddu

శ్రీవారి ఆలయ మహాప్రసాదం లడ్డూలో పిన్నీసు... పొరపాట్లు సహజమేనన్న తితిదే!

Devotee
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఇచ్చే మహాప్రసాదం లడ్డూలో నాణ్యత లోపిస్తుందనేందుకు తాజా ఘటన నిదర్శనం. గతంలో శ్రీవారి లడ్డూలో మేకులు కనిపించిన దాఖలాలున్నాయి. ఈ నేపథ్యంలో నిత్యం లక్షల సంఖ్యలో లడ్డూలు తయారవుతున్న తరుణంలో .. తిరుమల లడ్డూలో మంగళవారం ఓ పిన్నీసు కనబడి కలకలం రేపింది.  
 
ప్రసాదం పంపిణీ కేంద్రాల్లోని 13వ కౌంటర్ నుంచి ప్రసాదం స్వీకరించిన ఓ భక్తుడు అందులో పిన్నీసును చూసి షాకయ్యాడు. వెంటనే తేరుకున్న అతడు... పిన్నీసు ఉన్న సదరు లడ్డూను తిరిగి ఆ కౌంటర్‌లోని సిబ్బందికి స్వాధీనం చేశాడు. దీనిపై స్పందించిన టీటీడీ... రోజూ 3.5 లక్షల లడ్డూలు తయారవుతున్నారని, ఈ క్రమంలో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు సహజమేనని ప్రకటించింది. ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు తితిదే వెల్లడించింది. అయితే లడ్డూ ప్రసాదంపై పదే పదే విమర్శలు వస్తున్న తితిదే బేఖాతరు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. 
About Writer
Selvi